Top Google Searches: చంద్రయాన్ 3 ఈ సంవత్సరం గూగుల్ టాప్ సెర్చ్.. నెటిజన్లను ఆకర్షించిన చందమామ! 2023 Google Search: చంద్రయాన్ 3 2023లో గూగుల్ సెర్చ్ లో ప్రజలు అత్యధికంగా వెతికిన విషయం.. చంద్రయాన్ 3 తరువాత ఇజ్రాయెల్ సమస్య నిలిచింది By KVD Varma 12 Dec 2023 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Top Google Searches 2023: మరికొద్ది రోజుల్లో 2023వ సంవత్సరం ముగియనుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా గూగుల్ ఏడాది పొడవునా ప్రజలు అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాల జాబితాను విడుదల చేసింది. 2023లో దేశంలో అత్యధికంగా సెర్చ్ చేసింది చంద్రయాన్-3. గూగుల్ ట్రెండ్స్ ప్రకారం, చంద్రయాన్-3 (Chandrayaan-3) 20 ఆగస్టు 2023 నుంచి 26 ఆగస్టు 2023 వరకు అత్యధికంగా నెటిజన్ల సెర్చ్ ఆప్షన్ గా ఉంది. చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ చేసిన సమయం ఇదే. చంద్రయాన్-3 తర్వాత అత్యధికంగా సెర్చ్ చేసిన వార్తల్లో కర్ణాటక ఎన్నికల ఫలితాలు (Karnataka Election Results) నిలిచాయి. ఈ ఫలితాలు 13 మే 2023న వచ్చాయి. దీని తరువాత, ప్రజలు ఇజ్రాయెల్ సమస్య (Israel News), నటుడు సతీష్ కౌశిక్ మరణం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు. అలాగే, బడ్జెట్-2023, టర్కీలో భూకంపం, అతిక్ అహ్మద్ హత్య కేసు, మణిపూర్ హింస, ఒడిశా రైలు ప్రమాదం ఈ సంవత్సరంలో టాప్ 10 గూగుల్ లో (Top 10 Google Searches 2023) ప్రజలు వెతికిన అంశాలలో నిలిచాయి. Also Read: తుపాకీ లైసెన్స్ సినిమాల్లో చూపించినంత ఈజీ కాదు బాసూ.. పెద్ద ప్రాసెస్.. Google చంద్రయాన్-3 డూడుల్‌ను తెచ్చింది.. చంద్రయాన్-3 భారతదేశం మూడవ చంద్ర మిషన్. ఈ మిషన్ కింద, చంద్రయాన్-3 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) నుంచి జూలై 14, 2023న మధ్యాహ్నం 2:35 గంటలకు బయలుదేరింది. ఆగష్టు 23, 2023న, చంద్రయాన్ చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతమైన ల్యాండింగ్ చేసింది. దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ అవతరించింది. చంద్రయాన్-3 విజయాన్ని పురస్కరించుకుని గూగుల్ ఆగస్టులో డూడుల్‌ను రూపొందించింది. ప్రధాని మోదీ (Modi) ఇస్రోకు (ISRO) వెళ్లి చంద్రయాన్-3 శాస్త్రవేత్తలను కలిశారు.చంద్రయాన్ -3 మిషన్ విజయవంతం కావడంతో ఆగస్టు 25న బెంగళూరులోని ఇస్రో కమాండ్ సెంటర్‌లో చంద్రయాన్-3 బృందం శాస్త్రవేత్తలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇక్కడ ఆయన 3 ప్రకటనలు చేశారు. మొదటిది- ప్రతి సంవత్సరం ఆగస్టు 23న భారతదేశం జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటుంది. రెండవది- చంద్రునిపై ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని శివ-శక్తి పాయింట్ అంటారు. మూడవది- చంద్రయాన్-2 పాదముద్రలు ఉన్న చంద్రునిపై ఉన్న బిందువుకు 'తిరంగ' అని పేరు పెడతారు. Watch this interesting Video: #google #chandrayaan-3 #israel-news #google-search #google-searches-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి