Nandyala : పెద్ద సైకో తాడేపల్లెలో చిన్న సైకో నంద్యాలలో.. వారంతా దొంగ పోలీసులే : చంద్రబాబు! ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నంద్యాల సభలో హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ నాయకులు చీకటి రాజకీయాలు, చెత్త రాజకీయాలు చేస్తున్నారన్నారు. పెద్ద సైకో తాడేపల్లెలో ఉంటే చిన్న సైకో నంద్యాలలో ఉన్నాడంటూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. By srinivas 11 May 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Chandrababu Shocking Comments On Jagan : ఏపీ ఎన్నికల(AP Elections) ప్రచారంలో భాగంగా టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) శనివారం నంద్యాల సభలో హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ నాయకులు చీకటి రాజకీయాలు, చెత్త రాజకీయాలు చేస్తున్నారన్నారు. పెద్ద సైకో తాడేపల్లెలో ఉంటే చిన్న సైకో నంద్యాలలో ఉన్నాడంటూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. దొంగ పోలీసులు వచ్చి అరెస్టు చేశారు.. ఈ మేరకు చంద్రబాబు మాట్లాడుతూ.. నంద్యాల(Nandyala)కు రాగానే సెప్టెంబర్ 9 గుర్తొస్తుందని చెప్పారు. నంద్యాలకు దొంగ పోలీసులు వచ్చి అరెస్టు చేశారని, నంద్యాల ఎమ్మెల్యే ఇక్కడ ఏమైనా చేశాడా అంటూ ప్రశ్నించారు. ఐదేళ్లలో ఏమి చేయలేదని, ఇకపై కూడా చేయడన్నారు. ఇక పవన్ కోసం జనసేనా జెండాలు పట్టుకుని వచ్చిన అల్లు అర్జున్ ను వేరే పార్టీలు వాడుకోడం నీచమైన పని అన్నారు. మీ ఇంటికి అల్లు అర్జున్ వస్తే ఇలా వాడుకోవడం చౌకబారు రాజకీయం. ఇలాంటి తప్పుడు, చౌక బారు రాజకీయాలు ఎవ్వరూ చెయ్యరు. వైసీపీ నాయకులు చీకటి రాజకీయాలు,చెత్త రాజకీయాలు చేస్తున్నారు. పెద్ద సైకో తాడేపల్లెలో ఉంటే చిన్న సైకో నంద్యాలలో ఉన్నాడన్నారు. ఇది కూడా చదవండి: Elections 2024: ష్.. గప్ చుప్.. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం! అలాగూ ఉద్యోగాలు కావాలంటే కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీ, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే చేస్తానని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. పింఛన్ రూ.4 వేలకు పెంచి ఏప్రిల్ నుంచే అందిస్తామన్నారు. దివ్యాంగులకు రూ.6 వేలు పింఛన్ ఇస్తామన్నారు. భూమి పాసు పుస్తకంపై రాజముద్ర ఉండాలి.. సైకో ఫొటో కాదంటూ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని.. కూటమిదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. #nandyal-district #chandrababu #ap-elections-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి