AP News: చంద్రబాబు ప్రమాణస్వీకారం సమయంలో మార్పు.. ఏపీ సీఎంవో ప్రకటన!

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో మార్పులు చేసినట్లు ఏపీ సీఎంవో ప్రకటించింది. అమరావతిలో వర్షాలు పడుతున్న నేఫథ్యంలో వేదికను గన్నవరంకు మార్చినట్లు తెలిపింది. జూన్ 12న ఉదయం 9.27 గంటలకు ఆయన ప్రమాణం చేస్తారని స్పష్టం చేసింది.

New Update
CM Chandrababu: గుడ్ న్యూస్ చెప్పనున్న చంద్రబాబు సర్కార్

Chandrababu Naidu Oath Ceremony: ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోయే సమయంలో మార్పులు చేశారు. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు మొదట ప్రకటించారు. కానీ వర్షాలు పడుతుండటంతో అమరావతిలో నేల చిత్తడిగా మారిందని, ఈ నేపధ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకార ప్రాంతం మార్చినట్లు సీఎంవో (AP CMO) తెలిపింది. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం అమరావతి నుంచి గన్నవరంకు ఛేంజ్ చేశాం. ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలు వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ మార్పులు చేస్తున్నాం. ఈ నెల 12న ఉదయం 9.27 గంటలకు చంద్రబాబు ప్రమాణం చేస్తారని ఏపీ సీఎంవో ట్వీట్ చేసింది.

Also Read: కేంద్రంలో చట్ట విరుద్ధంగా ప్రభుత్వం కొలువుదీరుతోంది..మమతా బెనర్జీ

Advertisment
Advertisment
తాజా కథనాలు