CM Chandrababu : హైదరాబాద్‌లో చంద్రబాబు భారీ ర్యాలీ

తెలంగాణలో చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈరోజు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి ఎన్టీఆర్ భవన్‌కు భారీ ర్యాలీతో చేరుకోనున్నారు. ఈరోజు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. టీటీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిని చంద్రబాబు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
CM Chandrababu : హైదరాబాద్‌లో చంద్రబాబు భారీ ర్యాలీ

CM Chandrababu Huge Rally : తెలంగాణ (Telangana) లో చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈరోజు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి ఎన్టీఆర్ భవన్‌ (NTR Bhavan) కు భారీ ర్యాలీతో చేరుకోనున్నారు. ఈరోజు తెలంగాణ టీడీపీ (TDP) నేతలతో సమావేశం కానున్నారు. టీటీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిని చంద్రబాబు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

కీలక ప్రకటన చేసే అవకాశం..

టీటీడీపీ అధ్యక్షుడిని చంద్రబాబు (CM Chandrababu) ఈరోజు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని చంద్రబాబు ప్రకటించడంతో అప్పుడు తెలంగాణ తెలుగు దేశం పార్టీ ఇంఛార్జిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.

కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామాతో ఖాళీ గా తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడి పదవిని చంద్రబాబు ఇంకా భర్తీ చేయలేదు. దీనిపై ఈరోజు చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించి ఏపీలో వలె తెలంగాణలో కూడా టీడీపీని పోటీలో ఉంచనున్నారు. కాగా నిన్న సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు సమావేశమైన విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల విభజన సమస్యలపై చర్చించారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది.

Also Read : మాజీ సీఎం జగన్‌పై దాడి!.. కడపలో టెన్షన్

Advertisment
Advertisment
తాజా కథనాలు