KCR-Chandrababu: కేసీఆర్ కు చంద్రబాబు పరామర్శ హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం కేసీఆర్ ను పరామర్శించారు. By Nikhil 11 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Chandrababu Met KCR in Hospital: తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరగడంతో హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కేసీఆర్ ఆరు వారాల్లో ఎప్పటిలాగే నడుస్తారని డాక్టర్లు చెప్పారన్నారు. ఇది కూడా చదవండి: RYTHU BANDHU : రైతుబంధుపై సీఎం రేవంత్ కీలక సమీక్ష.. ఉద్యోగులతో పాటు వారికి కట్? కేసీఆర్ త్వరగా కోలుకుని ప్రజా సేవలో ముందుకు పోవాలని ఆకాంక్షించారు. చంద్రబాబు వెంట టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం కేసీఆర్ ను పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకుంటున్నారని వైద్యులు తనకు చెప్పినట్లు భట్టి తెలిపారు. భట్టి వెంట బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, జాన్సన్ నాయక్ తదితరులు ఉన్నారు. #kcr #chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి