CBN-Pawan : చంద్రబాబు ఇంటికి పవన్.. సీట్ల సర్దుబాటుపై చర్చ! సీట్ల సర్దుబాటుపై టీడీపీ- జనసేన ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే.. చంద్రబాబుతో పవన్‌కల్యాణ్ భేటీ అయ్యారు. ఇవాళ్టి భేటీలో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మీటింగ్ తర్వాత చంద్రబాబు-పవన్ మీడియా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. By Trinath 04 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి TDP - Janasena Alliance : ఏపీ(AP) లో పొత్తు రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. జనసేన-టీడీపీ(Janasena-TDP) సీట్ల వ్యవహారం మరికాసేపట్లోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబుతో పవన్ భేటీ కావడం చర్చనీయాంశమవుతోంది. ఇటీవలి కాలంలో చంద్రబాబు, పవన్ భేటీ అవ్వడం ఇది మూడోసారి. సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టోపై చర్చిస్తున్నారు. భేటీ తర్వాత మీడియా ముందుకు చంద్రబాబు, పవన్ రానున్నారని తెలుస్తోంది. పవన్‌తో భేటీ అనంతరం టీడీఎల్పీ(TDLP) సమావేశం కానుంది. రేపటి అసెంబ్లీ సమావేశాల్లో(Assembly Meeting) అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చ జరగనుంది. 35 ఇస్తారా? 35 సీట్లు మాత్రమే జనసేనకు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నట్టుగా సమాచారం. అయితే తనకు మరిన్ని సీట్లు కావాలని పవన్ అడుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో తమకు ఎక్కువ సీట్టు ఇవ్వాలని జనసేన పట్టుపడుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు జనసేనతోనే కలిసి పొత్తులో ఉన్న బీజేపీ గురించి ఊసే లేకపోవడాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. రేపటి నుంచి సమావేశాలు: ఫిబ్రవరి 5న గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పూర్తి బడ్జెట్‌కు బదులుగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్(Vote On Account Budget) మాత్రమే ప్రవేశపెడతారు. అసెంబ్లి సమావేశాలు మూడు రోజుల పాటు జరగనుండగా, ఎన్నికల కారణంగా సమయాభావం ఏర్పడింది. ఈ సమావేశాల్లో రాష్ట్ర భవిష్యత్తును రూపొందించే కీలకమైన చర్చలు, నిర్ణయాలు తీసుకోవచ్చని భావిస్తున్నారు. Also Read: రాజకీయాల్లో హుందాతనం లేదు.. సన్మాన వేదికపై ఇచ్చిపడేసిన చిరు WATCH: #pawan-kalyan #chandrababu-naidu #ap-elections-2024 #ap-politics-2024 #tdp-janasena మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి