Pawan meet with Chandrababu: చంద్రబాబుతో పవన్ భేటీ.. పొత్తులపై క్లారిటీ రానుందా..? ఏపీ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయా..? ప్రస్తుత రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రాత పోషించబోతున్నారా..? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమన్న పవన్ వ్యాఖ్యల వెనుక ఉన్న అంతర్యమేంటి..? నేడు చంద్రబాబు-పవన్ సమావేశం వెనుక రహస్యం ఏంటీ..? పవన్ ఢిల్లీ ముచ్చట చంద్రబాబు చెవిలో వేయనున్నారా..? ఎన్నికలకు మళ్లీ మూడు పార్టీలు కలిసి రంగంలోకి దిగనున్నాయా..? By Karthik 23 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ New Update షేర్ చేయండి ఏపీ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయా..? ప్రస్తుత రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రాత పోషించబోతున్నారా..? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమన్న పవన్ వ్యాఖ్యల వెనుక ఉన్న అంతర్యమేంటి..? నేడు చంద్రబాబు-పవన్ సమావేశం వెనుక రహస్యం ఏంటీ..? పవన్ ఢిల్లీ ముచ్చట చంద్రబాబు చెవిలో వేయనున్నారా..? ఎన్నికలకు మళ్లీ మూడు పార్టీలు కలిసి రంగంలోకి దిగనున్నాయా..? టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు(జూలై 23) సమావేశం కానున్నారు. ఇరు పార్టీలకు చెందిన నేతలు పొత్తులపై చర్చింనున్నారనే టాక్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ యాత్రలకు వస్తున్న ప్రజాధరణపై ఇరువురు నేతలు చర్చించనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇరువురు నేతలు ఇదివరకే వివిధ యాత్రల పేరుతో ప్రజల్లో తిరుగుతుండటంతో ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్.. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. వారితో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఎన్నికల ప్రచారం, రాష్ట్రంలో బీజేపీ సహకారంపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా రాష్ట్రంలో అధిక శాతం మంది ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉండటంతో 2014 తరహా కూటమిపై కూడా చర్చించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 39.17 శాతం ఓట్లతో 23 సీట్లు సాధించించగా.. 139 అసెంబ్లీ స్థానాలు 18 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన జనసేన కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కించుకుంది. ఎన్నికల అనంతరం ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో 0.84 శాతం ఓట్లు సాధించిన బీజేపీ.. ఏపీలో ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా వైసీపీని ఓడిస్తాయన్న అంచనాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో 49.95 శాంత ఓట్లను సాధించిన వైసీపీ.. 151 స్థానాలు దక్కించుకొని అధికారంలోకి వచ్చింది. మరోవైపు ఇరువురు నేతలు ఎవరికి వారుగా ప్రచారాలు చేసుకుంటున్నారు. రాజమండ్రిలో మహానాడు నిర్వహించిన టీడీపీ తన మిని మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో అధికారంలోకి వచ్చిన అనంతరం అమలు చేయబోయ్యే సంక్షేమ పథకాల గురించి టీడీపీ అందులో వెల్లడించింది. గతంలో కంటే బిన్నంగా ముందుగానే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తుంది. బస్సుయాత్ర నిర్వహిస్తున్న చంద్రబాబు మెల్ల మెల్లగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి ప్రజలకు వివరిస్తున్నారు. అమరావతి రైతులను మోసం చేసినట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా పేదలను మోసం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపిస్తున్నారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి అమరావతి రాజధానిగా అంగీకరించి ఇప్పుడు కాదనడం ఏంటని ప్రశ్నించారు. వైసీపీకి అభ్యంతరం ఉంటే గతంలోనే చెప్పొచ్చుకదా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం విశాఖలోని రిషీకొండను దోచేస్తుందని బాబు మండిపడ్డారు. అది ఎవరికీ కన్పించకుండా గ్రీన్ కార్పెట్‌తో కప్పేస్తుందని విమర్శించారు. రెండు విడతలు వారాహి యాత్ర నిర్వహించిన పవన్ కళ్యాణ్.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ కీలక నేతలపై విమర్శలు చేస్తున్నారు. అంతే కాకుండా వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో వాలంటీర్లు కుటుంబ సభ్యుల రహాస్యాలను అడిగి తెలుసుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబంలో మహిళలు ఏ సమయంలో ఎటు వెళ్తున్నారనే సమాచారం తీసుకుంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వమే వాలంటీర్ల చేత కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తున్నట్లు మరో బాంబు పేల్చారు. మహిళలు కిడ్నాప్ అవ్వడం వెనుక రాష్ట్ర ప్రభుత్వమే ఉందని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురుంధేశ్వరీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏపీ బీజేపీ పార్టీలో నూతనుత్తేజం అందుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తుండటంతో ఆ పార్టీలో పునరుత్తేజం వస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ నేతలు ప్రభుత్వంపై విమర్శులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అధికార పార్టీ నేతలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. 2014లో కొత్త రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయగా.. ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ విజయం సాధించింది. ప్రధాని మోడీ ఏపీకి ప్రత్యేక హోదా విస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఎన్డీయేకు మద్దతు తెలిపిన టీడీపీ ఎంపీల్లో పలువురిని ప్రధాని తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. 2018లో చంద్రబాబు నాయుడు ఎన్డీయే నుంచి బయటకు రావడంతో టీడీపీ ఎంపీలు సైతం కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేశారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మళ్లీ బీజేపీతో చేతులు కలపాలని చూస్తుంటే బీజేపీ మాత్రం దూరంగా ఉంటూ అవసరం వచ్చినప్పుడు చూద్దాంలే అనే విధంగా ముందుకు వెళ్తోంది. కాగా ప్రస్తుతం బీజేపీతో కలిసి పని చేస్తున్న పవన్ టీడీపీని కూడా వెంట తీసుకెళ్లాలని చూస్తున్నారు. చూడాలి మరి ఈ సమావేశంలో ఏం జరుగబోతోందని అనేది. #pawan-kalyan #tdp #chandrababu #janasena #meeting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి