Chandrababu : కేంద్రంలో చక్రం తిప్పేది చంద్రబాబే.. తేడా వస్తే ఎన్డీయేకు ఇబ్బందే!

కేంద్రంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మరోసారి కీ రోల్ ప్లే చేయనున్నారు. ఆయన ఎన్డీయేలో రెండో అతిపెద్ద భాగస్వామిగా నిలవనున్నారు.

New Update
Chandrababu : కేంద్రంలో చక్రం తిప్పేది చంద్రబాబే.. తేడా వస్తే ఎన్డీయేకు ఇబ్బందే!

TDP - NDA : ఈ ఎన్నికలు (Elections) సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ.. ఇన్నీ కాదు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైనాట్ 175 అన్న అధికార వైసీపీ (YCP) ని ఓటర్లు  పాతాళానికి తొక్కేశారు. మరో పక్క ఇస్ బార్ 400 - ఈసారి నాలుగొందల అంటూ బరిలో దిగిన కేంద్ర అధికార పక్షం బీజేపీకి సరైన వాత పెట్టారు. అరకొర మెజార్టీతో ఎన్డీయే ని గట్టెక్కించారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ (BJP) అధికారంలో కొనసాగాలి అంటే కచ్చితంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మద్దతు ఉండాల్సిందే. ఒక్క పార్టీ అటూ ఇటూ జరిగినా కేంద్రంలో రాజకీయ గందరగోళం తప్పదు. అయితే, ఈ క్లిష్ట పరిస్థితిలో రెండు పార్టీలు బీజేపీకి కీలకం కానున్నాయి. వాటిలో మొదటిది తెలుగుదేశం పార్టీ. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు (Chandrababu) ఇప్పుడు కేంద్రంలో మళ్ళీ వెలుగు వెలగనున్నారు. ఇక రెండో పార్టీ బీహార్ కు చెందిన  బిజూ జనతాదళ్. దీని అధినేత నితీష్ కుమార్. ఈయన ఇప్పటికే రెండు సార్లు కాంగ్రెస్ వైపు.. రెండు సార్లు బీజేపీ వైపు ఉన్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామిగా పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే మనుగడకు టీడీపీ, బీజేడీ అత్యంత ముఖ్యమైన పార్టీలుగా మారాయి. ఒకరకంగా చెప్పాలంటే బీజేపీ తరువాత ఎన్డీయేలో ఎక్కువ స్థానాలు ఉన్నది తెలుగుదేశం పార్టీకి. ఆ పార్టీకి 16 స్థానాలు ఉన్నాయి. ఇక బీజేడీ మూడో స్థానంలో 15 స్థానాలతో ఉంది. ఇప్పుడు మొత్తం 31 స్థానాలు వీరిద్దరి దగ్గర ఉన్నాయి. వీరు కనుక ఎన్డీయేకి హ్యాండ్ ఇస్తే.. ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది.

Also Read : Elections 2024 Results🔴 LIVE Updates: కూటమి హవా.. కౌంటింగ్ లైవ్ అప్ డేట్స్!

అలాచేస్తారా?
చంద్రబాబు కూడా గతంలో తెలంగాణ  ఎన్నికల సమయంలో నేరుగా కాంగ్రెస్ ను సమర్ధించారు. ఆ కారణంగానే నరేంద్ర మోదీకి దూరమైన పరిస్థితి ఉంది. మొన్న ఎన్నికల వరకూ ఎన్డీయే కూటమికి దూరంగానే చంద్రబాబు ఉన్నారు. ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల్లో.. పవన్ కళ్యాణ్ ఒత్తిడితో బీజేపీ తో దోస్తీకి సై అన్నారు. అటు బీజేపీ కూడా చంద్రబాబుతో సయోధ్యకు ముందు ససేమిరా అన్నప్పటికీ పవన్ కారణంగా కూటమికి కలిసి వచ్చారని విశ్లేషకులు చెబుతారు. ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు బీజేపీతో సఖ్యతతోనే ఉంటారని చెప్పవచ్చు. ఎందుకంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యంగా ఉండడం వలన లాభం ఏమిటో ఆయనకు బాగా తెలుసు. అంతేకాకుండా.. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు మంచి అవకాశం వచ్చింది.  ఏపీకి ప్రత్యేక హోదా.. రాజధాని నిర్మాణం విషయాల్లో బీజేపీని ఒత్తిడి చేయగలిగే పరిస్థితి చంద్రబాబుకు వచ్చింది. అందువల్ల చంద్రబాబు నాయుడుతో బీజేపీకి ఇబ్బంది ఉండకపోవచ్చు. కాకపోతే, చంద్రబాబు రాష్ట్రం కోసం కోరింది చేయాల్సిన పరిస్థితి అనివార్యంగా బీజేపీకి వచ్చిందని చెప్పవచ్చు.
publive-image

జాతీయ మీడియాలో కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు, నితీష్ కుమార్ ఏకం అవుతారని. బీజేపీని ఇబ్బంది పెడతారని వారి అంచనాగా ఉంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. వీరిద్దరూ మంచి మిత్రులు. గతంలో ఇద్దరూ కలిసి ఎన్డీయే కూటమిలో పనిచేశారు. ఇద్దరికీ రాష్ట్రానికి సంబంధించి.. తమ పార్టీలకు సంబంధించి కొన్ని ప్రత్యేక కోరికలు ఉన్నాయి. ఆ కారణంగానే వీరిద్దరూ ఎన్డీయేతో జట్టు కట్టారు. రాజకీయ ప్రయోజనాలు లెక్కలు వేసుకుంటే.. వీరిద్దరికీ కూడా కాంగ్రెస్ తో అంటకాగడం కంటే, బీజేపీతో కలిసి ఉంటేనే ప్రస్తుతానికి సేఫ్. అందువల్ల వీరిద్దరూ ఇప్పటికిప్పుడు బీజేపీతో దోస్తీని కటీఫ్ చేసుకునే పరిస్థితి ఉండదని చెప్పవచ్చు.

Advertisment
Advertisment
తాజా కథనాలు