Chandrababu Case: స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఈరోజు విచారణ చేసింది. అనంతరం హైకోర్టు విచారణను ఈనెల 17 కు వాయిదా వేసింది. దాంతోపాటూ కౌంటర్ దాఖలు చేయాలని సిఐడి కి హైకోర్టు ఆదేశించింది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసుల్లో ఒకటైన ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ పై ఈరోజు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. నిన్న విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఇరు వర్గాల న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. చంద్రబాబుని కోర్టులో హాజరు పరచాలని సిఐడి న్యాయవాది వివేకానంద వాదనలు వినిపించారు.

New Update
AP Skill Case: ఏపీ స్కిల్ కేసులో మరో ట్విస్ట్.. ఆ 12 మంది ఐఏఎస్ లకు ఉచ్చు?

Chandrababu Skill Development Case: చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు (AP High Court) ఈరోజు విచారణ చేసింది. అనంతరం హైకోర్టు విచారణను ఈనెల 17 కు వాయిదా వేసింది. దాంతోపాటూ కౌంటర్ దాఖలు చేయాలని సిఐడి (AP CID) కి హైకోర్టు ఆదేశించింది. ఇక చంద్రబాబుపై ఏపీ సీఐడీ నమోదు పీటీ వారెంట్ (PT Warrant) పై విజయవాడ ఏసీబీ కోర్టులో (ACB Court) నిన్న విచారణ జరిగింది. వాదనలు విన్న తర్వాత ఏసీబీ కోర్టు పీటీ వారెంట్‌పై విచారణ ఈరోజుకి వాయిదా వేసింది. సీఐడీ తరఫున న్యాయవాది వివేకానంద సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఫైబర్ నెట్ కేసు వివరాలు, ఎంత మందిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారనే విషయాలను వివేకానంద న్యాయమూర్తికి వివరించారు. చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలని ఉందని ఆయన వాదించారు.

కేసు పూర్వపరాలు.. చంద్రబాబు పాత్రపై వాదనలు వినిపించారు సీఐడీ తరపు న్యాయవాది వివేకా. చంద్రబాబు (Chandrababu) పాత్రను నిర్ధారిస్తూ కొన్ని డాక్యుమెంట్లను కోర్టుకు సబ్మిట్ చేశారు న్యాయవాది. వాదనలు సందర్భంగా వివిధ కీలకాంశాలను ప్రస్తావించారు. ఫైబర్ నెట్ కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరు పర్చాలని కోరారు వివేకా. జైల్లో ఉన్న చంద్రబాబును మళ్లీ ఫిజికల్‌గా కోర్టు ఎదుట హాజరు పర్చాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు జడ్జి. దీనికి స్పందించిన సీఐడీ న్యాయవాది.. గతంలో కొన్ని కేసుల్లో ఇదే విధంగా వ్యవహరించారని నాటి తీర్పులను ప్రస్తావించారు. కాగా, రెండేళ్ల క్రితం కేసు నమోదు చేసి.. ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు జడ్జి. దర్యాప్తులో భాగంగా చంద్రబాబు పాత్ర ఇప్పటికి నిర్దారణ అయిందని సీఐడీ తరపు న్యాయవాది వివరణ ఇచ్చారు.

Also Read: అమిత్ షాతో నారా లోకేష్ భేటీ.. పురందేశ్వరి మాస్టర్ ప్లాన్ ఇదేనా?

మరోవైపు ఫైబర్ నెట్ (Fiber Grid) పిటిషన్ మీద తమ వాదనలు వినాలని చంద్రబాబు తరఫు లాయర్లు ఏసీబీ కోర్టును కోరారు. దీంతో గురువారం మధ్యాహ్నమే వాదనలు వినడానికి ఏసీబీ కోర్టు అంగీకరించింది. అంతకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు తరపు న్యాయవాదులు వేసిన రైట్ టు ఆడియెన్స్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్‌ చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసులో (Inner Ring Road Case) పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారాయణ భార్య తో పాటు మరో 4గురిని పేర్లను సీఐడీ FIR లో నమోదు చేసింది. ఈరోజు వారి పాత్ర మీద కూడా విచారించే అవకాశం ఉంది.

ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నారా లోకేష్‌ను కలవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. విరి భేటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పురంధేశ్వరి ఉండటం.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వీరి భేటీ.. ఏపీ, తెలంగాణలో ఎలాంటి రాజకీయ మార్పులకు నాంది పలుకుతుందోనని చర్చ నడుస్తోంది.

Also Read:దటీజ్ విరాట్…నవీన్‌ను ట్రోల్ చేయొద్దని ఫ్యాన్స్ కు రిక్వెస్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు