AP News: ‘ఆడుదాం ఆంధ్రా’.. రోజా రూ.100 కోట్లు కొట్టేసిందా? సీఐడీకి ఫిర్యాదు మాజీ మంత్రి రోజాకు రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం సీఈవో ఆర్డీ ప్రసాద్ బిగ్ షాక్ ఇచ్చారు. ‘ఆడుదాం ఆంధ్రా’, ‘సీఎం కప్’ల పేరుతో రోజా భారీ అవినీతికి పాల్పడ్డట్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇందులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేరు కూడా చేర్చిన ఆయన ఇద్దరిపై విచారణ జరపాలని కోరారు. By srinivas 14 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Roja: మాజీ మంత్రి రోజాకు ఊహించని షాక్ తగిలింది. వైసీపీ ప్రభుత్వంలో క్రీడల శాఖ మాజీ మంత్రిగా పనిచేసిన రోజా ‘ఆడుదాం ఆంధ్రా’, ‘సీఎం కప్’ల పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారంటూ సీఐడీకి ఫిర్యాదు చేసినట్లు రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం సీఈవో ఆర్డీ ప్రసాద్ తెలిపారు. ఇందులో శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేరు కూడా చేర్చినట్లు చెప్పారు. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో.. ఈ మేరకు గురువారం విజయవాడలో విలేకర్లతో మాట్లాడిన ప్రసాద్.. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో జరిగిన రూ.100 కోట్ల అక్రమాలపై సీఐడీ విచారణ కోరుతూ ఈ నెల 11న అదనపు డీజీపీ (సీఐడీ)కి ఫిర్యాదు చేశాను. వారి హయాంలో పనిచేసిన శాప్ ఎండీలు, శాప్ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల్లోని డీఎస్‌డీవోలపై విచారణ జరపాలని కోరాను. క్రీడా కోటా ద్వారా మెడికల్, ఇంజినీరింగ్, ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు పొందిన వారిపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆ అవకతవకలను కూడా పరిశీలించాలి.. నాటి కార్యక్రమాలకు సంబంధించిన దస్త్రాలన్నీ సీజ్ చేయాలి. ఐదేళ్ల కాలంలో శాప్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలను కూడా పరిశీలించాలి. ఈ సమావేశంలో మోడరన్ ఖోఖో సంఘం అధ్యక్షుడు రత్తుల అప్పలస్వామి, టెన్నిస్ బాల్ క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శి ఆర్. బాబు నాయక్, కృష్ణా జిల్లా కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి కేవీ నాంచారయ్య పాల్గొన్నారు. #roja #cid #rd-prasad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి