Central Govt: 6 ఏళ్లు నిండిన వారినే ఒకటవ తరగతిలో చేర్చుకోవాలి: కేంద్రం

చిన్న పిల్లలకు ఆరేళ్లు నిండితేనే 1st క్లాస్‌లో అడ్మిషన్ ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మోదీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 3 నుంచి 8 ఏళ్ల వయసున్న పిల్లలకు 3 ఏళ్ల ప్రీ స్కూల్‌, 1, 2 తరగతులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

New Update
Central Govt: 6 ఏళ్లు నిండిన వారినే ఒకటవ తరగతిలో చేర్చుకోవాలి: కేంద్రం

Minimum Age For Class 1 is At Least 6 years:  మనదేశంలో సాధారణంగా ఐదేళ్లు దాటాక పిల్లలను స్కూల్‌కి పంపిస్తుంటారు. మరికొందరు తల్లిదండ్రులైతే ఐదేళ్లకు ముందే పాఠశాలకి తీసుకెళ్తారు. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లలకు ఆరేళ్లు నిండితేనే ఒకటవ తరగతిలో అడ్మిషన్ ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే మోదీ సర్కార్‌.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత దీనికి సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

Also Read: ఆ ప్రాంతంలో సొంత ‘అన్నాచెల్లి’ పెళ్లి చేసుకుంటారు.. కాదంటే శిక్ష

ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేయాలి

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020, రైట్‌ టు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ 2009 ప్రకారం.. ఒకటవ తరగతిలో చేరే పిల్లలకు తప్పకుండా ఆరేళ్లు ఉండాలని లేఖలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 3 నుంచి 8 ఏళ్ల వయసున్న పిల్లలకు 3 ఏళ్ల ప్రీ స్కూల్‌, 1, 2 తరగతులను పూర్తి చేసేలా విధానం ఉంటే.. పిల్లలు నేర్చుకునేందుకు మంచి అవకాశాలుంటాని ఎన్‌ఈపీ పాలసీలో పేర్కొన్న విషయాన్ని కేంద్రం గుర్తు చేసింది.

publive-image

సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తాం

పిల్లలను ఒకటవ తరగతిలో చేర్పించే వయసు వివిధ రాష్ట్రాల్లో వేరుగా ఉందని.. గతలో కేంద్రం లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో తెలిపింది. నూతన విద్యావిధానం, విద్యా హక్కు చట్టంలో ఉన్న ప్రొవిజన్స్‌ ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ (Ministry of Education) తెలిపింది. మరోవైపు 6 ఏళ్లు నిండితేనే ఒకటవ తరగతిలో చేర్చుకోవాలనే దానిపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకెళ్లి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై రేపు(బుధవారం) సీఎం చర్చించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ నిబంధనను CBSC పాఠశాలలు అమలు చేస్తున్నాయి. అయితే పిల్లల్ని స్కూల్లలో చేర్చుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక వయసు, కేంద్ర ఒక వయసు పెడితే ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు అంటున్నారు.

Also Read: సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసులు

Advertisment
Advertisment
తాజా కథనాలు