Floods in Telugu States: వరదల ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ ఆర్థిక సాయం

భారీ వర్షాల వల్ల వరదలతో కుదేలైన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. తక్షణ సాయంగా తెలంగాణ, ఏపీకి కలిపి రూ.3,300 కోట్లు విడుదల చేసింది. కేంద్రమంత్రి శివరాజ్‌ చింగ్‌ చౌహాన్‌ తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన సంగతి తెలిసిందే.

New Update
Floods in Telugu States: వరదల ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ ఆర్థిక సాయం

భారీ వర్షాల వల్ల వరదలు పోటెత్తడంతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. తక్షణ సాయంగా తెలంగాణ, ఏపీకి కలిపి రూ.3,300 కోట్లు విడుదల చేసింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ చింగ్‌ చౌహాన్‌తో పాటు కేంద్ర బృందం తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించింది. ఈ పర్యటనలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసింది. తాజాగా తెలంగాణ సెక్రటేరియట్‌లో కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహన్‌ సీఎం రేవంత్‌ను కలిశారు. అలాగే వరద నష్టంపై ఫొటో ఎగ్జిబిషన్‌కు పరిశీలించారు.

Also read: హైదరాబాద్‌లో కుమ్మేస్తోన్న వాన.. దాదాపు 2 గంటల నుంచి..!

ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన వరద ప్రభావిత ప్రాంతాల దృశ్యాలను పవర్‌ పాయింట్ ప్రాజెంటేషన్‌, ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా సీఎం, అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. పలు జిల్లాల్లో ఒకే రోజు అత్యధికంగా 40 సెం.మీ వర్షం కురిసిందని తెలిపారు. వరద ప్రభావిత జిల్లాలోని గ్రామాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. రోడ్లు, ఇళ్లు, వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రాకపోకలు స్తంభించాయని చెప్పారు. ప్రస్తుతం తక్షిణ సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు రూ.10 వేలు పంపిణీ చేస్తున్నామని సీఎం వివరించారు.

Also Read: కర్ణాటకలో మరో స్కామ్. రూ.1000 కోట్లు స్వాహా !

మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రంగా పంట నష్టం జరిగిందని అధికారులు కేంద్రమంత్రికి వివరించారు. మహబూబాబాద్ జిల్లాలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పరిస్థితిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. తెలంగాణలో మొత్తం వరద నష్టం దాదాపు రూ.5,438 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశామని తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్ నిధులను రాష్ట్రాలకు విడుదల చేసే విషయంలో ఇప్పుడున్న గైడ్‌లైన్స్‌ను సడలించాలని సీఎ రేవంత్ కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. తాత్కాలిక మరమ్మతులకు తక్షణ సాయం అందించాలని కోరారు. అలాగే శాశ్వత పునరుద్ధణ పనులకు తగినన్ని నిధులు కేటాయించాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలని కోరారు. యితే విపత్తుల సమయంలో ప్రజలకు సాయమందించే విషయంలో రాజకీయాలు ఉండవని కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ.3,300 కోట్ల నిధులు కేంద్రం విడుదల చేసింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

YS Jagan : జగన్కు ఎస్‌ఐ వార్నింగ్.. ఏందీ నువ్వు ఊడదీసేది అరటితొక్క!

జగన్ చేసిన కామెంట్స్ పై శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కూటమిలోని నేతలను చూసుకుని పోలీసులు రెచ్చిపోతే అధికారంలోకి వచ్చాక బట్టలూడదీసి కొడతామంటూ నిన్న జగన్ చేసిన కామెంట్స్ పై ఎస్‌ఐ సుధాకర్‌ ఓ వీడియో విడుదల చేశారు.  

New Update
jagan-si-sudhakar

jagan-si-sudhakar

ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ పై శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కూటమిలోని నేతలను చూసుకుని పోలీసులు రెచ్చిపోతే అధికారంలోకి వచ్చాక బట్టలూడదీసి కొడతామంటూ నిన్న జగన్ చేసిన కామెంట్స్ పై ఎస్‌ఐ సుధాకర్‌ ఓ వీడియో విడుదల చేశారు.  ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ..  ‘జగన్‌.. పోలీసులను బట్టలూడదీసి కొడతానంటున్నారా. పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకున్నారనుకున్నారా? అని ప్రశ్నించారు.  కష్టపడి చదివి, పరుగు పందెల్లో పాసై.. వేలాదిమంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫాం ఇది అని చెప్పుకొచ్చారు.

ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదు

మీరు వచ్చి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదన్నారు. తాము నిజాయతీగానే ప్రజల పక్షాన నిలబడతామన్న సుధాకర్..   నిజాయతీగానే ఉద్యోగం చేస్తామని, నిజాయతీగానే చస్తాం తప్ప.. అడ్డదారులు తొక్కమని తెలిపారు.  జగన్.. జాగ్రత్తగా మాట్లాడాలి.. జాగ్రత్తగా ఉండాలని ఎస్‌ఐ సుధాకర్‌ హెచ్చరించారు. ఇక  గతనెల మార్చిలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తాము చట్టబద్ధంగానే నడుచుకున్నామని సుధాకర్ తెలిపారు.  జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వందల మంది పోలీసులతో బందోబస్తు కల్పించామని.. అయినప్పటికీ ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకెళ్లి ఎన్నిక వాయిదా పడేలా చేశారని సుధాకర్ ఆ వీడియోలో ఆరోపించారు.

మాజీ సీఎం జగన్ అనుచరులు..  తమ దగ్గర గన్ లు ఉన్నాయని.. ఎవరొస్తారో రండి అంటూ రెచ్చగొడుతున్నారని.. ఇలా కిందిస్థాయి ఉద్యోగులను భయపెడితే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు సుధాకర్..ఈ విషయంలో ఉద్యోగులకు భరోసా కల్పించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, హోంమంత్రి, డీజీపీలను ఆయన కోరారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

 

 

Advertisment
Advertisment
Advertisment