GAS Cylinder Subsidy: గ్యాస్ సిలిండర్‌పై రూ.300 తగ్గింపు లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పీఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ పై ఇస్తున్న రూ.300 సబ్సిడీని మరో ఏడాదికి పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇందుకోసం రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. By V.J Reddy 07 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Gas Cylinder Price : లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) వేళ బీజేపీ సర్కార్(BJP Sarkar) కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దేశంలో మరోసారి అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తుంది. టార్గెట్ 400 ఎంపీ సీట్లు టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చే వార్తను చెప్పింది. పీఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్(Gas Cylinder) పై ఇస్తున్న రూ.300 సబ్సిడీని మరో ఏడాదికి పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) తెలిపారు. ఇందుకోసం రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్ లో గ్యాస్ సిలిండర్ ధర రూ. 955 గా ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సబ్సిడీ పథకం ద్వారా రూ.300 తగ్గి రూ. 655కే లభిస్తోంది. #WATCH | Union minister Piyush Goyal announces that the Cabinet has approved the continuation of the Rs 300 subsidy to PM Ujjwala Yojana consumers till 31st March 2025. The total expenditure for this will be Rs 12,000 crores, he adds. pic.twitter.com/F65E80v2Hb — ANI (@ANI) March 7, 2024 Also Read : లోక్ సభ ఎన్నికలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన ముడి జనపనార మద్దతూ ధర పెంపు.. ప్రధాని మోడీ(PM Modi) అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముడి జనపనార మద్దతు ధర పెంచింది. 2024-25 సీజన్‌లో ముడి జనపనారకు కనీస మద్దతు ధర(MSP) క్వింటాల్‌కు రూ. 5,335 గా పేర్కొంది, గత సీజన్‌తో పోలిస్తే క్వింటాల్‌కు రూ. 285 పెంచమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అలాగే రూ. 10,000 కోట్ల బడ్జెట్‌తో సమగ్ర జాతీయ స్థాయి ఇండియా ఏఐ మిషన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆయన తెలిపారు. #WATCH | The Union Cabinet has approved the Minimum Support Price (MSP) for Raw Jute for 2024-25 season at Rs 5,335 per quintal, an increase of Rs 285 per quintal over the previous season, announces Union Minister Piyush Goyal. pic.twitter.com/P9hNkemmPF — ANI (@ANI) March 7, 2024 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది మోడీ సర్కార్(Modi Sarkar). కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4శాతం డీఏ పెంచింది. ఉద్యోగులతో పాటు పెన్షన్ దారులకు 4 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన డీఏ 2024 జనవరి నుంచి వర్తిస్తుందని తెలిపింది. #WATCH | Union Cabinet approves hike in Dearness Allowance to govt employees and Dearness Relief to pensioners by 4% from January 1, 2024, announces Union Minister Piyush Goyal. pic.twitter.com/IsWUnwBGHW — ANI (@ANI) March 7, 2024 Also Read : గ్యారంటీ ఇస్తున్నా.. రాసిపెట్టుకోండి: సంగారెడ్డిలో మోడీ కీలక వ్యాఖ్యలు! #pm-modi #gas-cylinder-prices #bjp-sarkar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి