Telangana Elections 2023: తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం అడ్వయిజరీ లేఖ రాసింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండడంతో పాటూ స్టార్ క్యాంపెయినర్ గా ఉంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పింది. వీటిని తీవ్రంగా పరిగణిస్తాం అని సీఈసీ తెలిపింది.

New Update
Telangana Elections 2023: తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ

EC Serves Notice to KCR: ఎన్నికల ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఏ మాత్రం తేడాలొచ్చినా వెంటనే చర్యలు తీసుకుంటోంది. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) కు కేంద్ర ఎన్నికల సంఘం అడ్వయిజరీ లేఖ రాసింది. ఆ లేఖను నిన్న రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపుతూ కేసీఆర్ కు అందజేయాలని చెప్పింది. ఒక సీఎంగా ఉండి, ఎన్నికల ప్రచారంలో కూడా స్టార్ క్యాంపెయినర్ గా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కేంద్రం ఎన్నికల సంఘం కేసీఆర్ కు సూచించింది. ప్రజలను రెచ్చగొట్టేవిధంగా ప్రసంగాలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని తెలిపింది.

Also Read:రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిజామాబాద్ లో పోస్టర్లు

ప్రస్తుతానికి కేసీఆర్ ప్రసంగాలను సీరియస్ గా తీసుకోవడం లేదని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) అడ్వయిజరీ చెప్పింది. కానీ మాటలు హద్దులు దాటితే పార్టీ అనుమతులు రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని చెప్పింది. అనుచిత వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి లోబడి ప్రసంగాలు ఉండాలి అని కేంద్ర ఎన్నికల సంఘం రాసిన లేఖలో రాసినట్లు తెలుస్తోంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెల అక్టోబర్ 30న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టింది. నిజామాబాద్ బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల సభలో దుబ్బాక అభ్యర్ధి మీద కత్తిపోట్ల సంఘటన మీద ప్రతిపక్షాల మీద బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అనుచిత, పరుషమైన పదాలు ఉపయోగించటమే కాదు రెచ్చగొట్టేలా మాట్లాడారు కూడా. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం మీద కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్ధి సంఘమైన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బల్మూరి వెంకట్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీని మీద నివేదిక పంపాల్సిందిగా తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు లేఖ పంపారు. వికాస్ రాజ్ (Vikas Raj) ఇచ్చిన నివేదిక ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం అడ్వయిజరీ కేసీఆర్ కు లేఖ రాసింది.

Also Read:ఒక్కరోజే 10 శాతం జంప్.. LIC షేర్ సంచలనం.. ఒక్కసారే ఎందుకింత మార్పు?

Advertisment
Advertisment
తాజా కథనాలు