Amul vanilla: అమూల్ ఐస్ క్రీములో జెర్రీ.. కంగుతిన్న కస్టమర్స్! అమూల్ ఐస్ క్రీమ్ లో జెర్రీ దర్శనమివ్వడం సంచలనంగా మారింది. నొయిడాకు చెందిన దీప అనే మహిళకు ఈ చేదు అనుభవం ఎదురవగా దీనిని వీడియో తీసి నెట్టింట షేర్ చేసింది. దీనిపై ఫుడ్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 16 Jun 2024 in బిజినెస్ క్రైం New Update షేర్ చేయండి Centipede in Amul ice cream: మొన్న బిర్యానీలో బల్లీ, నిన్న ఐస్ క్రీమ్ లో తెగిన మనిషి వేలు. నేడు అమూల్ ఐస్ క్రీమ్ లో జెర్రీ దర్శనమివ్వడం ఫుడ్ ప్రియులను కలవరానికి గురిచేస్తోంది. హోటల్ అండ్ ప్యాక్డ్ ఫుడ్ తినాలంటే దడపుడుతోంది. గత వారం రోజులుగా కలుషిత భోజనానికి సంబంధించి వరుస సంఘటనలు వెలుగులోకి వస్తుండగా.. తాజాగా ఓ కస్టమర్ ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన ఐస్ క్రీంలో జెర్రీ దర్వనమివ్వడం సంచలనంగా మారింది. అమూల్ ఐస్‌క్రీమ్ బాక్స్‌లో జెర్రీ ఉత్తరప్రదేశ్ - నోయిడాలో దీప అనే మహిళ తాను ఆన్లైన్లో బ్లింకిట్ ద్వారా ఆర్డర్ చేసిన అమూల్ ఐస్‌క్రీమ్ బాక్స్ ప్యాక్‌ను తెరిచినప్పుడు జెర్రీ వచ్చిందని తెలిపింది. pic.twitter.com/l1CBiiugqJ — Telugu Scribe (@TeluguScribe) June 16, 2024 ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ లోని నొయిడాకు చెందిన దీప అనే మహిళ ఆన్ లైన్ డెలివరీ ప్లాట్ ఫామ్ బ్లింకిట్ లో అముల్ ఐస్ క్రీం ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ చేసింది. డెలివరీ అయ్యాక ప్యాకేజీ మూత ఓపెన్ చేసి చూడగా అందులో చనిపోయిన జెర్రి దర్శనమిచ్చింది. వెంటనే బ్లింకిట్ లో కంప్లైంట్ చేయగా తను చెల్లించిన డబ్బును తిరిగి పంపించారు. అయితే ఇంతటితో ఆగకుండా ఇందుకు సంబంధించిన ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. దీంతో అమూల్ కంపెనీ లో ఇలాంటి ఘటన జరగడం పట్ల నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతుండగా.. అధికారులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. #centipede #amul-ice-cream మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి