Exam Tips : ఒక ఎగ్జామ్‌ సరిగ్గా రాయలేకపోయారా? ఈ టిప్స్‌ పాటిస్తే మిగిలిన పరీక్షల్లో మీరే టాపర్!

పరీక్షల్లో ఒక పేపర్‌ సరిగ్గా రాయకపోతే అధైర్యపడవద్దు. మిగిలిన పేపర్స్‌పై దీని ప్రభావం పడకుండా ఉండేలా చూసుకోండి. ఒక ఎగ్జామ్‌ సరిగ్గారాయనంత మాత్రానా తల్లిదండ్రులు పిల్లలను తిట్టకూడదు. మిగిలిన పేపర్స్‌ను టెన్షన్‌ లేకుండా రాసేలా మద్దతివ్వాలి. ఆరోగ్యాన్ని అసలు నెగ్లెక్ట్‌ చేయవద్దు.

New Update
Exam Tips : ఒక ఎగ్జామ్‌ సరిగ్గా రాయలేకపోయారా? ఈ టిప్స్‌ పాటిస్తే మిగిలిన పరీక్షల్లో మీరే టాపర్!

EXAM TIPS 2024 : CBSE బోర్డు పరీక్షల రౌండ్ ప్రారంభమైంది. విద్యార్థులు ప్రధాన సబ్జెక్టులను బాగా ప్రిపేర్ అవుతున్నారు. అయితే కొన్నిసార్లు పరీక్షల్లో ఆశించినంతగా రాయలేకపోతాం. ముఖ్యంగా మొదట జరగే పరీక్షలను రాస్తున్నప్పుడు కాస్త ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడితో చదివినవి కూడా గుర్తురావు. ఇలా మొదట్లో జరిగే ఒకటి, రెండు పేపర్లు సరిగ్గా రాయకపోతే విద్యార్థులు ఒత్తిడికి గురవడం చాలాసార్లు కనిపిస్తుంది. దీంతో చదువుల నుంచి వారి మనసు మళ్లుతుంది. ఇది వారి మిగిలిన పరీక్షలను కూడా ప్రభావితం చేస్తుంది. పరీక్ష సమయం(Exam Time) లో మీకు ఇలా జరిగితే మీరు ఈ టిప్స్ పాటించవచ్చు.. అప్పుడు మిగిలిన పరీక్షలు బాగా రాసే ఛాన్స్ ఉంటుంది.

సంభాషణ:
ప్రతి బిడ్డ జీవితంలో కచ్చితంగా ఎవరో ఒకరు క్లోజ్ ఉంటారు. మీరు ఒత్తిడి ఫీల్ అవుతున్న సమయాల్లో ఆ ప్రత్యేక వ్యక్తి నుంచి సహాయం తీసుకోండి. ఇంకోటి గుర్తుపెట్టకోవాలి. ఒక పేపర్ లేదా ఒక బోర్డ్ ఎగ్జామ్ జీవితానికి ముగింపు కాదని పిల్లలకు చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. చదువుతో పాటు తనను తాను నిరూపించుకునే అనేక రంగాలు ఉన్నాయి.

సమస్యను అర్థం చేసుకోండి:
లోపాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు మీ ఫోన్ లేదా సోషల్ మీడియా(Social Media) ద్వారా పరధ్యానంలో ఉన్నారా? స్నేహితుడి సలహా కారణంగా మీరు మీ చదువుపై దృష్టి పెట్టలేకపోయారా? మీ పనితీరును పాడుచేసింది ఏమిటో తెలుసుకోండి . ఆ తప్పును సరిదిద్దుకోండి.

టెన్షన్ వద్దు:
పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఒక ఎగ్జామ్‌ సరిగ్గా రాయలేకపోయాం.. మిగిలినవి కూడా రాయాలేమా లాంటి వాటి గురించి ఆలోచించి టెన్షన్‌ తీసుకోవద్దు. మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మరింత నష్టానికి గురిచేయవద్దు.

తిట్టకూడదు:
తల్లిదండ్రులు(Parents) తమ పిల్లలను తిట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఒక ఎగ్జామ్‌ సరిగ్గా రాయలేకపోతే కొంతమంది తదుపరి పేపర్ కోసం ఒత్తిడి చేయడం ప్రారంభిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. దీని కారణంగా స్టూడెంట్‌పై ఒత్తిడి పెరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు పూర్తి మద్దతు ఇవ్వాలి.

ధైర్యాన్ని కోల్పోవద్దు:
ఒక సబ్జెక్టు పేపర్ బాగా రాయకపోతే నష్టమెమీ లేదు. మిగిలిన పరీక్షల్లోనూ బాగా రాణించవచ్చు. మిమ్మల్ని మీరు వైఫల్యంగా భావించే బదులు, కష్టపడి మిగిలిన పేపర్స్‌లో బాగా రాయడానికి మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి.

Also Read : ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

AP DSC: ఏపీ డీఎస్సీ దరఖాస్తు.. స్టెప్ బై స్టెప్ మీ కోసమే!

కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీటి దరఖాస్తు స్వీకరణ కూడా ప్రారంభమైంది. అయితే దీనికి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి.

New Update
Nara Lokesh

Nara Lokesh

కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఇప్పటికే దరఖాస్తు స్వీకరణ కూడా ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలి. అయితే డీఎస్సీకి అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం మంత్రి నారా లోకేష్ ప్రత్యేకమైన వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో చూసి స్టెప్ బై స్టెప్ ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. 

ఇది కూడా చూడండి: 10th Class Students: ఆన్సర్ షీట్లో రూ.500.. ఛాయ్‌ తాగి నన్ను పాస్‌ చేయండి - 10th క్లాస్ స్టూడెంట్స్ అరాచకం

ఇది కూడా చూడండి: మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్

స్టెప్ బై స్టెప్..

మెగా డీఎస్సీకి అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు డిపార్ట్‌మెంట్ ఆప్ స్కూల్ ఎడ్యుకేష‌న్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. 
క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్‌ను క్లిక్ చేసి కొత్త యూజర్లు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రిజిస్ట్రేష‌న్ లింక్ క్లిక్ చేయ‌గానే ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్ వస్తుంది.
దీని తర్వాత డీఎస్సీకి అప్లై చేసుకోవడానికి లాగిన్ కావాలి.
ఆ తర్వాత సెక్షన్ 1, సెక్షన్ 2లో వివరాలు పొందుపరచాలి. స్కూల్ నుంచి బీఈడీ వరకు అన్ని సర్టిఫికేట్లు వివరాలను అందించాలి. 

ఇది కూడా చూడండి: Paster praveen: పోలీసులకు వ్యతిరేకంగా KA పాల్ అనుమానాలు.. ఆర్టీవీతో ఎక్స్‌క్లూసివ్ వీడియో

అలాగే ఏపీ టెట్ క్వాలిఫికేషన్ వివరాలను పొందుపరచాలి.
చివరిలో వెరిఫికేషన్ చెక్ బాక్స్‌కు టిక్ పెట్టి వెరిఫై చేయాలి. 
ఆ తర్వాత సెక్షన్ 3లో జిల్లా, జోన్‌ను కూడా సెలక్ట్ చేసుకోవాలి. 
ఎగ్జామ్ సెంట‌ర్ ఆప్షన్స్‌ను సెలక్ట్ చేసుకోవాలి. 
మొత్తం అయిన తర్వాత ఒకే కొట్టి, చెక్ చేసుకుని ప్రోసీడ్ టూ పే అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. 
వెంట‌నే పేమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్స్ మెథ‌డ్స్ ద్వారా పేమెంట్స్ చేసుకోవ‌చ్చు. 
మొత్తం ప్రాసెస్ పూర్త‌యిన త‌ర్వాత డాక్యుమెంట్ అప్‌లోడింగ్ ఆప్ష‌న్‌పై క్లిక్ చేసి సంబంధిత ప‌త్రాల‌ను అప్‌లోడ్ చేయాలి. చివ‌రిగా అప్లికేష‌న్ ఫామ్‌ను ప్రింట్ తీసుకోవాలి. 

ఇది కూడా చూడండి: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్‌..ఒక్క క్లిక్ చాలు!

Advertisment
Advertisment
Advertisment