CBSE : తొమ్మిదొవ తరగతి పుస్తకంలో డేటింగ్, రిలేషన్‌షిప్స్ పాఠాలు! సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 9వ తరగతి విలువ విద్య పాఠ్యపుస్తకంలో లవ్, డేటింగ్, రిలేషన్స్ వంటి ఇతర అంశాలకు సంబంధించిన పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టింది. By srinivas 03 Feb 2024 in జాబ్స్ నేషనల్ New Update షేర్ చేయండి Dating And Relationships : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. టీనేజీ దశలోకి అడుగుపెడుతున్న యువతీ యువకులకు లవ్(Love), డేటింగ్(Dating), రిలేషన్‌షిప్(Relationship) వంటి విషయాలను స్కూల్ దశనుంచే నేర్పించేందుకు రిలేషన్షిప్ ఎడ్యుకేషన్ అధ్యాయాలను ప్రవేశపెట్టింది. ఈ మేరకు 9వ తరగతి(IX Class) విలువ విద్య పాఠ్యపుస్తకంలో ప్రేమ, డేటింగ్, రిలేషన్స్ వంటి ఇతర అంశాలపై పాఠ్యాంశాలను బోధించనున్నట్లు తెలిపింది. 9th class textbooks nowadays 🥰🙏🏻 pic.twitter.com/WcllP4vMn3 — khushi (@nashpateee) January 30, 2024 క్రష్ అండ్ ఫ్రెండ్ షిప్.. ఈ పాఠాలను పూర్తిగా డేటింగ్, రిలేషన్‌షిప్‌కు సంబంధించిన చిన్న చిన్న విషయాలను చర్చించేందుకు తయారు చేశారు. ఇందులో గోస్టింగ్, క్యాట్ ఫిషింగ్, సైబర్ బెదిరింపులు వంటి వాటిని వివరించేలా ఉన్నాయి. వీటితోపాటు క్రష్‌లు, ప్రత్యేక స్నేహాలు వంటి వాటిని కూడా సాధారణ కథలుగా ఉదాహరణలతో సహా వివరించారు. ఇక బుక్ లో పాఠ్యాంశానికి సంబంధించిన ఫొటోలను ఓ నెటిజన్ ట్విటర్(X) లో పంచుకోవడంతో సోషల్ మీడియా(Social Media) లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కాలంలో 9 వ తరగతి పాఠ్య పుస్తకాలు ఇలా ఉన్నాయని.. ఆ నెటిజన్ పేర్కొన్నారు. ఈ పాఠాలను చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. next chapter : how to deal with breakups 😭 — Tinder India (@Tinder_India) January 31, 2024 Also Read : అత్యాచారం చేశాడని యువతి పిటిషన్.. నిందితునికి సపోర్ట్ చేసిన కోర్టు .. హర్షం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.. అయితే ప్రస్తుత కాలంలో ఇలాంటి విషయాలను వివరించేందుకు సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే దీనిపై ఆన్‌లైన్ డేటింగ్ వెబ్‌సైట్ అయిన టిండర్ ఇండియా ట్విటర్‌లో స్పందించింది. ఇక తర్వాతి పాఠం బ్రేకప్‌ల గురించి ఉంటుందేమో అని పేర్కొంది. ఈ ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'ఈ పుస్తకాన్ని నాకు పంపించండి.. మొత్తం చాప్టర్‌ను నేను చదవాల్సిన అవసరం ఉంది' అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక గతంలో తమకు అబ్బాయిలతో స్నేహం చేయడానికి కూడా అనుమతి లేకపోయేదని మరొక నెటిజన్ పేర్కొన్నారు. ఇది చాలా మంచి నిర్ణయమని.. ఇంకో నెటిజన్ ట్వీట్ చేశారు. ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో చిన్న పిల్లలకు ఆన్‌లైన్‌లో చాలా విషయాలు అందుబాటులో ఉంటున్నాయని.. అయితే ఇలాంటివి ప్రవేశపెట్టడం వల్ల చెత్త అంతా నేర్చుకోకుండా ఉంటుందని తెలిపారు. ఇలాంటివి మంచి భాగస్వాములను ఎంచుకునేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. నిజమైన అభివృద్ధి.. నిజాయితీగా చెప్పాలంటే ఇది చాలా గ్రేట్ అని మరో నెటిజన్ తెలిపారు. ఇదే భారత విద్యా వ్యవస్థ(Indian Education System) లో ప్రతీ ఒక్కరు కోరుకున్న నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. ఇది చాలా అవసరమని మరొకరు ట్వీట్ చేశారు. టీనేజీ దశలో ప్రేమల కారణంగా సూసైడ్‌లు, డిప్రెషన్‌లోకి వెళ్లడం, మత్తు పదార్థాలకు బానిక కావడం వంటివి జరుగుతున్నాయని.. వాటిని అరికట్టేందుకు ఇలాంటి పాఠ్యాంశాలు చాలా అవసరమని పేర్కొన్నారు. డేటింగ్, పెళ్లి, రిలేషన్‌షిప్, విడాకులు, లవ్, బ్రేకప్‌లు మనిషి జీవితంలో ఒక భాగాలేనని.. అవన్నీ 20 ఏళ్లకు ముందే తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. యువతకు వారి జీవితాల్లో రిలేషన్‌లను ఎలా ఎంచుకోవాలి.. వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి.. ఎలా ముందుకు నడిపించాలి అనే విషయాలను నేర్చుకునేందుకు ఇదొక సరైన విధానమని అంటున్నారు. Also Read : ఏపీ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది? షర్మిలా ఏం చేయబోతున్నారు? #cbse #dating-and-relationships #lessons #ix-class మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి