MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో కవితకు సీబీఐ నోటీసులు కవితకు షాక్ ఇచ్చింది సీబీఐ. లిక్కర్ స్కాం కేసులో కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో హైదరాబాద్ కు వచ్చి కవిత వద్ద స్టేట్ మెంట్ ను సీబీఐ అధికారులు రికార్డు చేసుకున్న విషయం తెలిసిందే. By V.J Reddy 21 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CBI Notices to MLC Kavitha: కవితకు షాక్ ఇచ్చింది సీబీఐ. లిక్కర్ స్కాం కేసులో (Delhi Liquor Scam Case) కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో హైదరాబాద్ కు వచ్చి కవిత వద్ద స్టేట్ మెంట్ ను సీబీఐ (CBI) అధికారులు రికార్డు చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఇదే లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. అయితే.. ఈడీ ఇచ్చిన నోటీసులపై కోర్టును ఆశ్రయించారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తనకు నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత ఇంకా స్పందించలేదు. ఈడీ (ED) విచారణకు హాజరు కానీ కవిత.. ఇప్పుడు సీబీఐ ఇచ్చిన నోటీసుల మేరకు విచారణకు హాజరు అవుతారా? లేదా? అనేది ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) దగ్గర పడుతున్న వేళ కవిత ఈడీ, సీబీఐ నోటీసులు ఇవ్వడం తెలంగాణ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ALSO READ: కాంగ్రెస్ తోలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్ జనవరిలో ఈడీ నోటీసులు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఇరుక్కోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పట్లో ఆమెను ఈడీ అధికారులు కూడా విచారణ చేశారు. దీంతో కవిత అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటూ జోరుగా ప్రచారాలు కూడా జరిగాయి. ఇప్పటివరకు ఈడీ (ED) కవితకు మూడు సార్లు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే జనవరి 15న కవితకు ఈడీ నాలుగోసారి నోటీసులు జారీ చేసింది. విచారణకు రాలేను లిక్కర్ స్కామ్ కేసులో జనవరి 16వ తేదీ మంగళవారం ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు రావాలంటూ ఈడీ సమన్లు పంపింది. ఇందుకు స్పందించిన ఎమ్మెల్సీ కవిత ఈడీకి లేఖ రాశారు. ఈ లిక్కర్ కేసు విచారణకు రాలేనంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నుంచి తనకు రక్షణ కల్పించే ఉత్తర్వులు ఉన్నాయని.. ఇప్పటికీ తన కేసు సుప్రీంకోర్టులో (Supreme Court) పెండింగ్‌లో ఉందని అందుకే రాలేకపోతున్నానంటూ కవిత లేఖలో తెలిపారు. #mlc-kavitha #brs-party #delhi-liquor-scam-case #cbi-notices-to-mlc-kavitha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి