Telangana: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు.
మేడిగడ్డ దగ్గర అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేసిన కారణంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కేసు నమోదు అయింది. ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గత నెల 26న బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డను సందర్శించారు.
BRS Working President KTR:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కేసు నోదు చేశారు.భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ పీఎస్ లో బీఎన్ఎస్ 223(b) కింద ఎఫ్ఐఆర్ నమోదు అయింది.అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద డ్రోన్ ఎగరేశారంటూ..ఇరిగేషన్ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. గత నెల 26న మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించినప్పుడు ఈ సంఘటన జరిగిందని వివరించారు. కేటీఆర్ పర్యటనలో అనుమతులు లేకుండా డ్రోన్ ఎగరవేశాని చెప్పారు. కేటీఆర్ తో పాటు బాల్క సుమన్, గండ్ర వెంకటరమణా రెడ్డిల మీద కేసు నమోదు చేశామని పలీసులు తెలిపారు.
TGSRTC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీ
తెలంగాణ ఆర్టీసీ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. త్వరలో 3,038 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్టీసీ సంస్థ వైస్ ఛైర్మన్, ఎండీ సజ్జనార్ ప్రకటించారు. దీనికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ కూడా వచ్చిందని తెలిపారు.
తెలంగాణ ఆర్టీసీ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. త్వరలో 3,038 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్టీసీ సంస్థ వైస్ ఛైర్మన్, ఎండీ సజ్జనార్ ప్రకటించారు. దీనికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ కూడా వచ్చిందని తెలిపారు. వీటి భర్తీ తర్వాత కార్మికులు, ఉద్యోగులపై పనిభారం తగ్గుతుందని పేర్కొన్నారు. సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన తర్వాత ఆయన మాట్లాడారు. కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని కూడా చెప్పారు. సంస్థలోని ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని తెలిపారు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీ ప్రకారం మరో 18వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
గ్రూప్1,2,3,4 పోస్టులతోపాటు పోలీసు, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖలో14,236 అంగన్ వాడీ, హెల్త్ డిపార్ట్మెంట్లో 4 వేలకు పైగా పోస్టులకు ఏప్రిల్ చివరిలోగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరిన్ని శాఖల ఖాళీలపై స్పష్టత రాగానే జాబ్‌క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ విడుదలకానున్నాయి. ఇక ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్‌ను షెడ్యూల్ చేసినప్పటికీ ఎస్సీ వర్గీకరణ కోసం వాయిదా వేశారు. గురుకుల ఉద్యోగాలు, సింగరేణి కాలరీస్, ఇంజినీరింగ్ పోస్టుల నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావాల్సివుంది.