Karnataka: మైనర్ బాలికపై హాకీ ప్లేయర్ అత్యాచారం.. పెళ్లి పేరుతో ఐదేళ్లుగా

భారత హాకీ ప్లేయర్ వరుణ్ కుమార్‌ అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 17 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంటానని నమ్మించి 5 ఏళ్లుగా లైంగిక దాడి చేసినట్లు కర్ణాటకు చెందిన యువతి ఫిర్యాదు చేసింది. బెంగుళూర్ పోలీసులు కేసు నమోదు చేయగా వరుణ్ పరారీలో ఉన్నాడు.

New Update
Karnataka: మైనర్ బాలికపై హాకీ ప్లేయర్ అత్యాచారం.. పెళ్లి పేరుతో ఐదేళ్లుగా

Hockey player : మైనర్‌ బాలికపై అత్యాచారం (Sexual Abuse) చేశాడనే ఆరోపణలతో భారత హాకీ ప్లేయర్ వరుణ్ కుమార్‌ (Hockey player Varun Kumar)పై బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత ఐదేళ్లలో పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఆమె ఫిర్యాదు చేసింది.

17 ఏళ్ల వయసులో పరిచయం..
ఈ మేరకు బెంగుళూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన సదరు యువతి, హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన వరుణ్‌ కుమార్‌ లకు 2019లో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పరిచయం ఏర్పడింది. అప్పుడు తన వయసు 17 ఏళ్లు అని ఆమె చెప్పింది. అయితే కోచింగ్‌ క్యాంపుల కోసం బెంగళూరులోని సాయి స్టేడియంకు వచ్చిన వరుణ్‌కుమార్‌ తనతో శృంగారంలో పాల్గొనేవాడని యువతి ఆరోపించింది. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడని, గత ఐదేళ్లలో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డట్లు ఫిర్యాదు చేయడంతో వరుణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Delhi: ఉగ్రవాదిగా మారిన మాజీ సైనికుడు.. పాక్‌ టెర్రరిస్టులతో కలిసి భారీ కుట్ర

పరారీలో వరుణ్..
ఇక వరుణ్‌ పంజాబ్‌లోని జలంధర్‌లో నివసిస్తున్నాడని, అతడిని విచారించేందుకు కర్ణాటక పోలీసుల బృందం జలంధర్‌ వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. హాకీ ఇండియా లీగ్‌లో పంజాబ్‌ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ్‌.. జాతీయ జట్టులోనూ ఆడాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకోవడంతో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అతనికి ₹ 1 లక్ష బహుమతిని ప్రకటించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు