Vijayawada: వరద ఎఫెక్ట్.. విజయవాడలో నీటమునిగిన కార్ల షోరుం వరద ప్రభావానికి విజయవాడ అతలాకుతలమైంది. నున్న ప్రాంతం సమీపంలో టాటా కార్ల షోరూం నీట మునిగింది. షోరూం గ్రౌండ్‌లో దాదాపు 300 కొత్త కార్లు పార్కు చేయగా.. వరద ప్రభావానికి అవి మునిగిపోయాయి.రూ.కోట్లల్లో నష్టం జరిగిందని షోరుం సిబ్బంది వాపోయారు. By B Aravind 03 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి భారీ వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. అనేక ఇళ్లు నీటమునిగాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. ఆహారం, నీళ్లు లేక వరద బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక ఏపీలో విజయవాడ జలదిగ్బంధమయ్యింది. బుడమేరు వరద ప్రభావంతో వందల కోట్ల నష్టం వాటిల్లింది. అయితే నున్న ప్రాంతం సమీపంలో టాటా కార్ల షోరూం నీట మునిగింది. Also Read: అన్ని జిల్లాలకు హైడ్రా.. ఆక్రమణలపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్! షోరూం గ్రౌండ్‌లో దాదాపు 300 కొత్త కార్లు పార్కు చేయగా.. వరద ప్రభావానికి అవి మునిగిపోయాయి. కార్లతో పాటు ఆటోలు, టాటా వ్యాన్లు కూడా మునిగిపోయాయి. రూ.కోట్లల్లో నష్టం జరిగిందని షోరుం సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. వరద పూర్తిగా తగ్గితే కానీ ఇంకా పూర్తిగా నష్టం అంచనా వేయలేమని వాపోయారు. #AndhraPradesh. 300 brand new cars and some are under service. pic.twitter.com/grpGBA72Gt — @Coreena Enet Suares (@CoreenaSuares2) September 3, 2024 #heavy-rains #vijayawada-floods #andhra-pradesh-floods మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి