Ganja Milk Shake : మిల్క్ షేక్ ల్లో గంజాయి పౌడర్.. పాలు, హార్లిక్స్, బూస్ట్ లో గుర్తించిన హైదరాబాద్ పోలీసులు!

హైదరాబాద్ లో మరో గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కోల్‌కతాకు చెందిన కేటుగాళ్లు గంజాయిని పౌడర్ గా మార్చి మిల్క్ షేక్స్, చాక్లెట్స్, స్వీట్స్, పాలు, హార్లిక్స్, బూస్ట్ ల్లో కలిపి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. జగద్గిరిగుట్టలోని జయశ్రీ దుకాణదారు మనోజ్ ను అదుపులోకి తీసుకున్నారు.

New Update
Ganja Milk Shake : మిల్క్ షేక్ ల్లో గంజాయి పౌడర్.. పాలు, హార్లిక్స్, బూస్ట్ లో గుర్తించిన హైదరాబాద్ పోలీసులు!

Ganja : దేశవ్యాప్తంగా గంజాయి మత్తు ఊహించని రేంజ్ లో వ్యాపిస్తోంది. గంజాయి స్మగ్లర్స్(Ganja Smugglers) చిన్నా పెద్ద తేడా లేకుండా అందరినీ ఈ మత్తుకు బానిసలుగా మారుస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా చలామణి అవుతోంది. ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం ఎంతటి నిఘా పెట్టిన వివిధ రూపాల్లో సరాఫరా చేస్తున్నారు కేటుగాళ్లు. ఇటీవలే హైదరాబాద్(Hyderabad) పరిసరాల్లోని పలు స్కూల్లకు దగ్గరలోని కిరాణ షాపుల్లో చాక్లెట్ రూపంలో గంజాయిని విక్రయించి విద్యార్థులను ఆగం చేసిన ఇష్యూ మరవకముందే మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.

రోజుకో కొత్త రకంగా సప్లయ్..
ఈ మేరకు గంజాయి ముడిసరుకును పౌడర్‌గా మార్చి రోజుకో కొత్త రకంగా సప్లయ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చాక్లెట్స్, స్వీట్స్, హష్ అయిల్‌గా సరఫరా చేసిన కోల్‌కతా(Kolkata) కు చెందిన ఓ ముఠా తాజాగా గంజాయి మిల్క్‌షేక్స్‌(Milk Shakes) ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. గంజా పౌడర్‌ను పాలు, హార్లిక్స్, బూస్టులో కలుపుకుని తాగితే ఆరోగ్యానికి మంచిదంటూ సలహాలిస్తూ యువతను మత్తుకు బానిస చేస్తు్న్నట్లు వెల్లడించారు. రెండు రోజుల క్రితం సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు జగద్గిరిగుట్ట ప్రాంతంలో జయశ్రీ కిరాణా దుకాణం నిర్వహిస్తున్న మనోజ్ కుమార్‌ను అదుపులోకి తీసుని విచారించగా.. అసలు విషయం బయటపడిందని తెలిపారు.

ఇది కూడా చదవండి: Indian World Film Festival : ‘మంగళవారం’ దర్శకుడికి ఉత్తమ డైరెక్టర్ అవార్డు!

మిల్క్ షేక్ తాగితే 7 గంటలు మత్తులో..
అంతేకాదు హైదరాబాద్ నగరంలోకి గంజాయిని పౌడర్‌గా తీసుకొచ్చి చాక్లెట్స్, సిగరెట్ ఖాళీ చేసి అందులో నింపి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ పౌడర్‌ కిలోకు రూ.2,500 అమ్ముతున్నారని, గంజాయితో తయారు చేసిన చాక్లెట్‌ ధర రూ.40 ఉన్నట్లు చెప్పారు. ఇక మిల్క్ షేక్ తాగితే 7 గంటలు మత్తులో ఉంటున్నారని వెల్లడించారు. పలు అడ్డాలల్లో ఈ దందాకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేస్తున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు