4వేల ఏళ్ల క్రితమే క్యాన్సర్ కు చికిత్స..!

పురాతన ఈజిప్షియన్లు క్యాన్సర్‌ను నయం చేయడానికి ప్రయత్నించారని వింటే మీరు ఆశ్చర్యపోతున్నారా? 4,000 ఏళ్ల నాటి పుర్రెపై కత్తి జాడలు ఉండడంతో పరిశోధనా బృందం ఆశ్చర్యానికి గురైయారు.తరువాత ఆ పుర్రె పై చేసిన పరిశోధనలలో చాలా విషయాలు కనుగొన్నారు.

New Update
4వేల ఏళ్ల క్రితమే క్యాన్సర్ కు చికిత్స..!

పురాతన ఈజిప్షియన్లు వైద్య రంగంలో నైపుణ్యం మాత్రమే కాకుండా క్యాన్సర్‌ను నయం చేయడానికి కూడా ప్రయత్నించారని ఒక అధ్యయనం సూచిస్తుంది. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం, జర్మనీలోని ట్యూబింజెన్ విశ్వవిద్యాలయం, ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్, స్పెయిన్‌లోని బార్సిలోనా , శాంటియాగో డి కంపోస్టెలా శాస్త్రవేత్తలు 4,000 సంవత్సరాల పురాతన పుర్రెలలో DNA ను అధ్యయనం చేశారు. వేల సంవత్సరాల క్రితం మెదడు కణితులను తొలగించిన రోగులకు ఆధారాలు వారు కనుగొన్నారు.

"4,000 సంవత్సరాల క్రితం క్యాన్సర్ శస్త్రచికిత్స జరిగిందో లేదో తెలుసుకోవడానికి మేము పురాతన పుర్రెలను అధ్యయనం చేస్తున్నాము" అని పరిశోధనా బృందం అధిపతి , ట్యూబింజెన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త టటియానా టోండిని చెప్పారు. పరిశోధించిన పుర్రెలు ఇప్పుడు డక్‌వర్త్ మ్యూజియం, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉంచబడ్డాయి. 

అలాగే, మైక్రోస్కోప్‌లో కత్తిరించిన కత్తిని మొదటిసారి చూసినప్పుడు, మా ముందు ఏమి ఉందో మేము నమ్మలేకపోయాము. పురాతన ఈజిప్షియన్లకు క్యాన్సర్ కణాల శస్త్రచికిత్స గురించి తెలుసునని ఇది స్పష్టంగా చూపిస్తుంది. అని కూడా చెప్పాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SAF vs RSF: పారామిలిటరీ బలగాలపై దాడి.. 100 మందికి పైగా?

పారామిలిటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ బలగాలు నార్త్‌ డార్ఫర్‌లోని రెండు శిబిరాలపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో దాదాపుగా 114 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఈ విషయాన్ని స్టేట్‌ హెల్త్‌ అథారిటీ డైరెక్టర్‌ జనరల్‌ ఇబ్రహీం ఖతీర్‌ వెల్లడించారు.

New Update
Sudan

Sudan Photograph: (Sudan)

ఆఫ్రికా దేశమైన సూడాన్‌‌లో పారామిలిటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ బలగాలు దాడికి పాల్పడ్డాయి. నార్త్ డార్ఫర్‌లో ఉన్న రెండు శిభిరాలపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో దాదాపుగా 114 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని స్టేట్‌ హెల్త్‌ అథారిటీ డైరెక్టర్‌ జనరల్‌ ఇబ్రహీం ఖతీర్‌ వెల్లడించారు.

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

114 మందికి పైగా..

జామ్జామ్‌లో ఉన్న పౌరుల శిబిరాలపై ఆర్‌ఎస్‌ఎఫ్‌ బలగాలు శుక్రవారం దాడులు చేశాయి. ఈ దాడుల్లో 114 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరిలో తొమ్మిది మంది రిలీఫ్‌ ఇంటర్నేషనల్ ఉద్యోగులు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే 2023లో సుడాన్ ఆర్మీ చీఫ్, RSF మధ్య ఘర్షణ ఏర్పడింది. ఇప్పటికి SAF, RSF మధ్య వార్ జరుగుతోంది. 

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

ఇది కూడా చూడండి:  AP Crime News : అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు...లక్షల విలువచేసే బంగారంతో…

Advertisment
Advertisment
Advertisment