TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్...ఈ తేదీల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు రద్దు..!! తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక.ఫిబ్రవరి15, 16, 17 తేదీల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు రద్దు చేయనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రథసప్తమి సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. By Bhoomi 02 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి TTD: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక.ఫిబ్రవరి15, 16, 17 తేదీల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు రద్దు చేయనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రథసప్తమి సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.అన్నమయ్య భవన్ లో టీటీడీ, పోలీసు అధికారులతో ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం 3.5లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ పెట్టుకోవాలని సిబ్బందికి సూచించారు. వాహనసేవలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తిలకించే విధంగా ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. వాహన సేవల ఎదుట ఆకట్టుకునే విధంగా సాంస్క్రుతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు మజ్జిగ,తాగునీరు,సాంబారు అన్నం,పెరుగన్నం,పులిహోర, పొంగలి వంటి అన్నప్రసాదాలను నిరంతరం పంపిణీ చేయాలని ఆదేశించారు. రథసప్తమిని పురస్కరించుకుని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఆ రోజు ప్రత్యేక దర్శనాలు ఉండవని వెల్లడించారు. ఇది కూడా చదవండి: నూతన ప్రభుత్వం అయినా ఉపకార వేతనాలు చెల్లించేనా..? అటు తిరుమల తిరుపతి దేవాస్థానం బోర్డు సమావేశంలో భక్తుల కోసం కొన్ని ముఖ్య నిర్ణయాలను తీసుకున్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా బంగారు డాలర్లు తరహాలో శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళ సూత్రాలను భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. మహిళల కోసం మంగళసూత్రాలు, లక్ష్మీకాసులను తయారు చేయించాలని నిర్ణయించారు. లాభాపేక్ష లేకుండా మంగళసూత్రాలు, లక్ష్మీ కాసులు విక్రయిస్తామని తెలిపారు. హైందవస్త్రీలకు ఈ మంగళసూత్రాలు, లక్ష్మీ కాసులు ఒక అమూల్యమైన కానుక అన్నారు. వేదపాఠశాల్లో 51మంది సంభావన అధ్యాపకుల వేతనాలు రూ. 34 వేల నుంచి రూ. 54 వేలకు పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. #ttd #ttd-eo-dharma-reddy #ratha-saptami మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి