Helth Benefits: వంకాయతో కూడా బరువు తగ్గొచ్చా?.. నిపుణులు ఏమంటున్నారు? వంకాయ కూరల్లో దీన్ని రాజుగా పిలుస్తారు. రుచితో అంత గొప్పగా ఉంటుంది, వంకాయతో ఏ కూర వండినా అద్భుతమే అని చెప్పాలి. కానీ వంకాయ బరువు తగ్గడంతో పాటు కొవ్వు మొత్తం కరిగిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 10 Nov 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి eggplant lose weigh: ప్రస్తుతం ఆహారపు అలవాట్ల కారణంగా ప్రతి ఒక్కరూ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఇబ్బందులు పడుతుంటారు. అంతేకాకుండా విపరీతంగా బరువు కూడా పెరుగుతుంటారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. చిన్నాపెద్దా తేడా లేకుండా కొవ్వు పెరిగి ఊభకాయులుగా మారుతున్నారు. అయితే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును వేగంగా తగ్గించి వెంటనే బరువు తగ్గేలా చేయడంలో వంకాయ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: వాట్సాప్ స్టేటస్ పెట్టాడు..45 లక్షలు గోవిందా..జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు బరువు తగ్గడమే కాకుండా వంకాయ తినడం వల్ల రోజు మొత్తం అలుపులేకుండా చురుగ్గా పనులు చేసుకుంటారు. వంకాయలో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మన శరీరానికి కావాల్సిన మినరల్స్, విటమిన్స్, పోషకాలన్నీ అందుతాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కూడా వంకాయలో అధికంగా ఉంటాయి. వంకాయలో తక్కువ మోతాదులో సోడియం, ఎక్కువ మోతాదులో పొటాషియం ఉంటుంది. అలాగే మన రక్తంలోని షుగర్ లెవల్స్, కొలెస్ట్రాల్ లెవల్స్‌ను నియంత్రణలో ఉండేలా చేస్తుంది. శరీరంలో రోజుల తరబడి పేరుకుపోయిన కొవ్వును కరిగించే లక్షణాలు వంకాయలో ఎక్కువగా ఉంటాయి. అయితే.. బరువు తగ్గించుకోవాలంటే వంకాయను ఎలా ఉపయోగించాలనేది ఇప్పుడు చూద్దాం. తొందరగా బరువు తగ్గుతారు మొదట గిన్నెలో నీటిని పోసి బాగా మరిగించాలి. నీళ్లు బాగా వేడి అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న వంకాయను వేసి మెత్తగా అయ్యేలా ఉండికించాలి. ఆ తర్వాత వంకాయ ముక్కలను తీసి గిన్నెలో వేసుకుని మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత వాటిలో రెండు చెంచాల నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిని తింటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తొందరగా కరుగుతుంది. నిత్యం దీన్ని తినడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు. పొట్టచుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు అంటున్నారు. #helth-benefits #eggplant-lose-weigh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి