National : అసదుద్దీన్ జై పాలస్తీనా నినాదంపై వివాదం.. ఆయన ఇచ్చిన వివరణ ఇదే! పార్లమెంటులో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన జై పాలస్తీనా నినాదం వివాదం రేపుతోంది. వేరే దేశానికి జై ఎలా కొడతారు అందులో అడుగుతుంటే...అందులో తప్పేముందుని అసదుద్దీన్ అంటున్నారు. అయితే సభ్యులు మాత్రం దీని మీద కంప్లైట్ చేశారని అంటున్నారు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు. By Manogna alamuru 25 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి MP Asaduddin Owaisi : తెలంగాణ (Telangana) ఎంపీ, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) ఈరోజు పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేశారు. దీని తర్వాత ఆయన జూ పాలస్తీనా అంటూ నినాదాలు చేశారు. ఆ విషయం ఇప్పుడు దుమారం రేపుతోంది. భారతదేశ పార్లమెంటులో జై పాలస్తీనా అంటూ నినాదాలు చేయడం ఏంటని మిగిలిన నేతలు ప్రశ్నిస్తుననారు. భారత రాజ్యాంగం (Indian Constitution) దీన్ని ఎలా ఒప్పుకుంటుందని అడుగుతున్నారు. అసదుద్దీన్ మీద పార్లమెంటరీ వ్యవహారా శాఖకు కంప్లైంట్ కూడా చేశారు. అయితే తాను చేసిన దానిలో తప్పేముందని అడుగుతున్నారు ఎంపీ అసదుద్దీన్. ప్రమాణం చేసటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో స్లోగన్ చేశారు. అలాగే నేను కూడా అన్నాను. జైపాలస్తీనా తో పాటూ జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ అని కూడా అన్నాను. అదెలా తప్పు అవుతుంది అని అడిగారు. అలా స్లోగన్ చేయడం తప్పు అని రాజ్యాంగంలో ఉందా అని ప్రశ్నించారు. ఇక మన పార్లమెంటులో పాలస్తీనా గురించి మాట్లాడ్డం పరి అయినదేనా అడిగిన ప్రశ్నకు సమాధానంగా... ఆ దేశం గురించి మహాత్మాగాంధీ ఏం చెప్పారో చూసుకోండి అంటూ బదులు చెప్పారు. అది కాక అన్నదేదో అనేశాను... దాని మీద ఎందుకు రాద్ధాంత చేస్తున్నారు అని కూడా అన్నారు అసదుద్దీన్. తాను అన్నది తప్పు అయితే పార్లమెంటరీ వ్యవహారాలశాఖ చూసుకుంటుందని అన్నారు. జై పాలస్తీనా' వివాదంపై స్పందించిన ఒవైసీ లోక్ సభ లో 'జై పాలస్తీనా' నినాదం చేయడంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ పార్లమెంట్ బయట వివరణ ఇచ్చారు. 'ప్రమాణం చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో స్లోగన్ ఇచ్చారు. నేను కేవలం జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని చెప్పాను. అది ఎలా… pic.twitter.com/4XpsH2bpv5 — RTV (@RTVnewsnetwork) June 25, 2024 ఇక అసదుద్దీన్ నినాదం మీద పార్లమెంటరీ వ్యవహారాలశాక మంత్రి కిరణ్ రిజిజు కూడా స్పందించారు. తమకు ఏ దేశంతోనూ శత్రుత్వం లేదని ఆయన అన్నారు. అయితే ఇలా మన పార్లమెంటు (Parliament) లో మరో దేశం గురించి పొగుడుతూ స్లోగన్స్ చేయడం సరైనదా, కాదా అన్నది పరిశీలించాల్సి ఉందని ఆయన చెప్పారు. రాజ్యాంగంలో నిబంధనలను చూడాల్సి ఉందని కిరణ్ రిజిజు అన్నారు. అసదుద్దీన్ చేసిన నిఆదాల మీద కొందరు సభ్యులు తనకు ఫిర్యాదు చేశారని... వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపారు. #WATCH | On AIMIM MP Asaduddin Owaisi's words during his oath in the Parliament, Parliamentary Affairs Minister Kiren Rijiju says, "We do not have any enmity with Palestine or any other country. While taking the oath is it proper for any member to raise the slogan praising… pic.twitter.com/ZyYXDl5JRF — ANI (@ANI) June 25, 2024 Also Read:Movies: భారతీయుడు ఈజ్ బ్యాక్..2 ట్రైలర్ వచ్చేసింది #parliament #palestine #asaduddin-owisi #slogan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి