Calcutta: మహిళలను ‘డార్లింగ్’ అంటే లైంగిక వేధింపే.. హైకోర్టు సంచలన తీర్పు!

పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపేనని కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలా పిలిచిన వ్యక్తులను ఐపీసీ 354ఏ, 509 సెక్షన్ల కింద నేరస్థులుగా పరిగణించవచ్చని పేర్కొంది. లేడీ కానిస్టేబుల్ ఇష్యూలో భాగంగా ఈ తీర్పు వెల్లడించింది న్యాయస్థానం.

New Update
Calcutta: మహిళలను ‘డార్లింగ్’ అంటే లైంగిక వేధింపే.. హైకోర్టు సంచలన తీర్పు!

Darling: మహిళలను పలకరించే పద్ధతిపై కలకత్తా హైకోర్టు (Calcutta High Court) సంచలన తీర్పు వెల్లడించింది. పరిచయం లేని స్త్రీలను ‘డార్లింగ్’ (Darling)అని పిలవడం లైంగిక వేధింపేనని స్పష్టం చేసింది. ఇటీవల ఓ మహిళా కానిస్టేబుల్ కు సంబంధించిన ఇష్యూపై ఈ రోజు విచారణ జరిపిన న్యాయస్థానం అసభ్యంగా పిలిచిన వ్యక్తులను ఐపీసీ 354ఏ, 509 సెక్షన్ల కింద నేరస్థులుగా పరిగణించవచ్చని పేర్కొంది.

మహిళా కానిస్టేబుల్‌ ఫిర్యాదు..
ఈ మేరకు పోర్టు బ్లెయిర్‌లోని హైకోర్టు బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ జై సేన్‌గుప్తా తీర్పు వెలువడింది. అయితే గతేడాది అండమాన్‌ నికోబార్‌లోని మాయాబందర్‌ ప్రాంతంలో దుర్గా పూజ సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. విధుల్లో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్‌తో జనక్‌ రామ్‌ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఉన్న జానకి రామ్ ఆమెను డార్లింగ్‌ అంటూ పిలవడంతోపాటు ‘చలాన్‌ ఇవ్వడానికి వచ్చావా’ అంటూ దురుసుగా వ్యవహరించాడు. దీంతో అతనిపై మహిళా కానిస్టేబుల్‌ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: Yuzvendra Chahal: చాహల్‌ను పైకి ఎత్తిపడేసిన యువతి.. వీడియో వైరల్!

3 నెలల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా..
ఇక ఈ వివాదంపై నార్త్‌ - మిడిల్‌ అండమాన్‌ ఫస్ట్‌క్లాస్‌ కోర్టు విచారణ జరిపింది. జానకి రామ్ ను దోషిగా తేల్చుతూ 3 నెలల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ తీర్పును అడిషనల్‌ సెషన్స్‌ కోర్టులో అతడు సవాల్‌ చేయగా దానిని తిరస్కరించారు. అనంతరం కలకత్తా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ జై సేన్‌గుప్తా ధర్మాసనం ఫస్ట్‌క్లాస్‌ కోర్టు తీర్పును సమర్థించడంతోపాటు డార్లింగ్‌ అని పిలవడం లైంగిక వేధింపేనని తెలిపారు. దీనిపై పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Accident: దారుణం.. ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి

హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి బైక్‌ వాహనాదారుడు మృతి చెందాడు.ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో భాగంగా బైక్‌ను ఆపేందుకు యత్నించారు. బైక్ అదుపు తప్పడంతో అతడు కిందపడ్డాడు. దీంతో ఆర్టీసీ బస్సు అతని తలపై నుంచి వెళ్లింది.

New Update
Accident

Accident

హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి బైక్‌ వాహనాదారుడు మృతి చెందాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో భాగంగా బైక్‌ను ఆపేందుకు యత్నించారు. అయితే బైక్ అదుపు తప్పింది. దీంతో వాహనాదారుడు కిందపడ్డాడు. ఇదే సమయంలో వచ్చిన ఒక్కసారిగా వచ్చిన ఆర్టీసీ బస్సు అతడి తలపై నుంచి వెళ్లింది. 

Also Read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

దీంతో ఆ బైక్ వాహనాదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆ వ్యక్తి మృతి చెందాడని వాహనాదారులు ఆందోళనకు దిగారు. దీంతో జీడిమెట్ల నుంచి బాలానగర్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై పలువురు వాగ్వాదానికి దిగారు. చివరికి పోలీసులు వాళ్లని చెదరగొట్టారు. ఆ తర్వాత ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.  

Also Read: అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!

Advertisment
Advertisment
Advertisment