CAG Report On Telangana Revenue: తెలంగాణలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత లేదు.. కాగ్ నివేదిక తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత కరువైందని కాగ్ నివేదిక పేర్కొంది. గత ప్రభుత్వం విద్య, వైద్యం మీద ఖర్చుల విషయంలో వెనుకంజలో ఉందని తెలిపింది. మొత్తం వ్యయంలో.. విద్య మీద 8 శాతం ఖర్చు చేయగా, వైద్యం కోసం 4 శాతం మాత్రమే ఖర్చు చేశారని తెలిపింది. By V.J Reddy 15 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CAG Report On Telangana Revenue Department: ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్, రెవెన్యూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ ఇచ్చిన నివేదికను ప్రెవేశ పెట్టారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాగ్ ఇచ్చిన నివేదికలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. ALSO READ: వాహనదారులకు బిగ్ అలర్ట్.. మరికొన్ని గంటలు మాత్రమే! పంచాయతీ రాజ్ శాఖ... పంక్చర్! పంచాయతీ రాజ్ శాఖపై కాగ్ ఇచ్చిన నివేదికలో కీలక విషయాలు బయటపడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో గ్రాంట్ల మళ్లింపు జరిగిందని పేర్కొంది. నిధుల దుర్వినియోగం జరిగినట్లు తెలిపింది. బకాయిలు వసూలు చేయడంలో గత ప్రభుత్వం విఫలం అయిందని పేర్కొంది. కొన్ని పనులకు అధిక బిల్లులు చెల్లించారని.. సకాలంలో రికార్డులు సమర్పించలేదని మొట్టికాయలు వేసింది. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత లేదు... తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత కరువైందని కాగ్ నివేదిక పేర్కొంది. గత ప్రభుత్వం విద్య, వైద్యం మీద ఖర్చుల విషయంలో వెనుకంజలో ఉందని తెలిపింది. మొత్తం వ్యయంలో.. విద్య మీద 8 శాతం ఖర్చు చేయగా, వైద్యం కోసం 4 శాతం మాత్రమే ఖర్చు చేశారని తెలిపింది. గడిచిన మూడు సంవత్సరాలుగా రెవెన్యూ రాబడిని సాధించడంలో విఫలం అయిందని వెల్లడించింది. ద్రవ్య లోటు 46,638 కోట్లు, అప్పుల నిష్పత్తి GSDP తో పోలిస్తే 37.77 శాతం అని.. FRMB పరిమితి తో తెలంగాణ రాష్ట్ర అప్పుల నిష్పత్తి 12.77 శాతం ఎక్కువగా ఉందని తెలిపింది. 15వ ఆర్థిక సంఘంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర నిష్పత్తి 8. 47% ఎక్కువ అని తేల్చి చెప్పింది. మొత్తం రాష్ట్రం సొంత పనుల నుంచి షాపులు రిజిస్ట్రేషన్లు వస్తుసేవల పన్ను అమ్మకాలు ఇవన్నీ 91,270 కోట్లు రాష్ట్రానికి రాబడి అని.. 2021-22 లో వ్యవహారిక వ్యయం 1,36,804 కోట్ల రూపాయలుగా పేర్కొంది. వ్యవహారిక విషయంలో జీతాలు, పెన్షన్ల మీద ఖర్చు తగ్గిందని తెలిపింది. చెప్పింది కొండంత.. చేసింది గోరంత.. గత ప్రభుత్వం రెవెన్యూ రాబడి ఎక్కువ చూపించి.. లోటును తక్కువగా చూపించిందని కాగ్ నివేదిక పేర్కొంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మధ్య ఆస్తులు, అప్పుల పంపకంపై పురోగతి జరగలేదని తేల్చి చెప్పింది. విభజన ఆస్తుల పంపకాలపై తగినంత దృష్టి పెట్టలేదని తెలిపింది. రూ.1.18లక్షల కోట్ల రుణాలను బడ్జెట్‌లో పేర్కొనలేదని వెల్లడించింది. అప్పుల ద్వారానే రెవెన్యూ లోటును భర్తీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రుణాలపై 2032-33 నాటికి రూ.2.52లక్షల కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తుందని తెలిపింది. DO WATCH: #cm-revanth-reddy #cag-report-on-kaleswaram #kaleshwaram-scam #cag-report-on-telangana-revenue మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి