Gold Jewellery : ఇలా చేశారంటే బంగారు ఆభరణాలు కొత్తవాటిలా మెరుస్తాయి

ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు నల్లబడుతుంటాయి. కేవలం వంట గదిలో దొరికే కొన్ని వస్తువులతో ఆభరణాలకు మెరుగులు దిద్దవచ్చు. పసుపు, టూత్‌పేస్ట్‌, వెనిగర్‌, బేకింగ్‌ సోడా, బంగారాన్ని శుభ్రం చేసే లిక్విడ్‌ తయారీతో పాత ఆభరణాలు కొత్తవాటిలా మెరుస్తాయి.

New Update
Gold Rates Hike: తగ్గడం తాత్కాలికమే.. మళ్ళీ పెరిగిన బంగారం.. ఈరోజు ఎంత ఉందంటే.. 

Gold Jewellery Do Like This : ఇంట్లో బంగారు(Gold), వెండి(Silver) ఆభరణాలు నల్లబడుతుంటాయి. రంగు వెలిసిపోయి పాతవాటిలా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో పెద్దగా కష్టపడకుండా ఇంట్లోనే సులభమైన చిట్కాలను ఉపయోగించి వాటిని మళ్లీ కొత్తవాటిలా మెరిపించవచ్చు. కేవలం వంట గదిలో దొరికే కొన్ని వస్తువులతో ఆభరణాలకు మెరుగులు దిద్దవచ్చు. దీంతో పాత ఆభరణాలు కొత్తవాటిలా మెరుస్తాయి.

Turmeric

పసుపు, టూత్‌పేస్ట్‌:

పసుపు(Turmeric), టూత్‌పేస్ట్ సహాయంతో మీ ఆభరణాలను సులభంగా ప్రకాశింపజేయవచ్చు. కొద్దిగా పసుపు తీసుకొని అందులో కొద్దిగా టూత్‌పేస్ట్ కలపండి. ఇప్పుడు టూత్ బ్రష్ సహాయంతో ఆభరణాలను బాగా రుద్దాలి. ఆ తర్వాత కడగాలి. కడిగే సమయంలో బాగా స్క్రబ్బింగ్ చేస్తే బంగారు ఆభరణాల మెరుపు పెరగడంతో పాటు అందంగా కనిపిస్తాయి.

White Vinegar

వెనిగర్‌, బేకింగ్‌ సోడా:

అంతేకాకుండా వెనిగర్(White Vinegar) తీసుకొని అందులో కొద్దిగా బేకింగ్ సోడా(Baking Soda) కలపాలి. తర్వాత టూత్ బ్రష్(Tooth Brush) సహాయంతో బంగారు ఆభరణాలను నెమ్మదిగా రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత మస్లిన్ క్లాత్‌లో వేసి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బంగారు ఆభరణాల రంగు మెరుగుపడుతుంది. అలాగే నిమ్మరసం, పసుపుతో కూడా ఆభరణాలను శుభ్రం చేసుకోవచ్చు.

Tooth Brush

బంగారాన్ని శుభ్రం చేసే లిక్విడ్‌ తయారీ:

గిన్నెలో గోరువెచ్చని నీళ్లలో కాస్త డిష్‌ సోప్‌ లేదా లిక్విడ్‌ జ్యుయలరీ క్లీనర్‌(Liquid Jewellery Cleaner) వేయాలి. కెమికల్స్‌, రాపిడ్‌ క్లీనర్లను కలపడం వల్ల ఆభరణాలు పాడవుతాయని నిపుణులు అంటున్నారు. ముందుగా బంగారు ఆభరణాలను లిక్విడ్‌లో 20 నిమిషాల పాటు నానబెట్టాలి. దీంతో దుమ్ము, ధూళి వదిలిపోతుంది. ఆ తర్వాత సున్నితంగా బ్రష్‌తో రుద్దాలి. ఆ తర్వాత మామూలు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత సున్నితమైన గుడ్డతో తుడిచి ఆరబెట్టాలి.

ఇది కూడా చదవండి : రుతుక్రమంలో సమస్యలకు ఒక్క బెల్లం ముక్కతో చెక్‌ పెట్టండి

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు