Harbhajan Singh: టీమ్‌ ఎంపికపై బజ్జీ అసంతృప్తి.. అతను ఎందుకు లేడు.!

సెలక్టర్లపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆసియా కప్‌కు ఎంపిక చేసిన భారత టీమ్‌లో స్పిన్నర్‌ చాహల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు. 2022లో జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌లో చాహల్‌ను ఎంపిక చేయని బీసీసీఐ.. రానున్న వన్డే వరల్డ్‌ కప్‌లో టీమ్‌కు చాహల్‌ అవసరం ఎంతైనా ఉందన్నారు.

New Update
Harbhajan Singh: టీమ్‌ ఎంపికపై బజ్జీ అసంతృప్తి.. అతను ఎందుకు లేడు.!

ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించిన నాటి నుంచి సెలక్టర్లపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీమ్‌ ఎంపికపై ఇటీవల గౌతం గంబీర్‌, సునీల్‌ గవాస్కర్‌ స్పందించగా.. తాజాగా టీమ్‌ ఎంపికపై మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ సైతం స్పందించాడు. టీమ్‌ ఎంపికపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసియా కప్‌కు స్పిన్నర్‌ చాహల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని బజ్జి ప్రశ్నించారు. గత టీ20 వరల్డ్‌ కప్‌లో సైతం చాహల్‌ను ఎంపిక చేయని బీసీసీఐ.. వన్డే ఫార్మాట్‌కు కూడా ఎంపిక చేయచేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. గత కొన్ని మ్యాచ్‌ల్లో చాహల్‌ రాణించకపోయినంత మత్రాన పక్కన పెడుతారా అని ప్రశ్నించారు.

publive-image

రాబోయే వన్డే వరల్డ్‌ కప్‌లో స్పిన్నర్‌ చాహల్‌ టీమ్‌లో ఉండాల్సిందేనని హర్భజన్ సింగ్‌ స్పష్టం చేశారు. ఈ మెగా టోర్నీలో భారత్‌ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ లాంటి మేటి జట్లతో తలపడే అవకాశం ఉందని, ఈ టీమ్‌కు చెందిన ప్లేయర్లు చాహల్ బౌలింగ్‌లొ బ్యాటింగ్‌ చేయాలంటే ఇబ్బంది పడుతారని బజ్జీ గుర్తు చేశారు. అలాంటి మేటి బ్యాటర్లు ఫెవిలీయన్‌ పంపాలంటే.. చాహల్‌ కచ్చితంగా టీమ్‌లో ఉండాలన్న ఆయన.. చాహల్‌కు ద్వారాలు ఇంకా మూసుకుపోలేదని స్పష్టం చేశాడు. వరల్డ్ కప్ ఇండియాలో జరగుతున్న నేపథ్యంలో, జట్టుకు చాహల్ సేవలు అవసరమని కితాబిచ్చాడు.

ఆసియా కప్‌ ఈ నెల 30 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు జరుగనుంది. ఈ టోర్నీలో ఆసియా ఖండానికి చెందిన క్రికెట్‌ ఆడే దేశాల చెందిన టీమ్‌లు మాత్రమే పాల్గొననున్నాయి. పాకిస్థాన్‌, శ్రీలంక దేశాలు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో భారత జట్టు తన పూర్తి మ్యాచ్‌లు శ్రీలంకలో ఆడనుంది. అనంతరం వన్డే వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ అక్టోబర్‌ 5 నుంచి నవంబర్ 19 వరకు జరుగనుంది. కాగా ఈ మెగా టోర్నీ భారత్‌లో జరుగనుండగా.. ఇందులో భారత్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా టీమ్‌లు నేరుగా అర్హత సాధించాయి. మరో రెండు జట్లు క్వాలిఫయర్‌ ద్వారా వన్డే వరల్డ్‌ కప్‌కు ఎంపిక కానున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు