అరుదైన ఘనత.. దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా.. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యుత్తమ బ్యాంక్‌గా నిలిచింది. ఈ విషయాన్ని అమెరికా గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఈ ఏడాది అత్యుత్తమ బ్యాంక్‌గా ఎస్‌బీఐ అని ప్రకటించింది. By Kusuma 28 Oct 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి అందరూ ఎక్కువగా వినియోగించే స్టేట్ బ్యాంక్‌కి అరుదైన ఘనత లభించింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యుత్తమ బ్యాంక్‌గా నిలిచింది. ఈ విషయాన్ని అమెరికా గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశం సందర్భంగా వాషింగ్టన్‌లో అంతర్జాతీయ ద్రవ్య నిధిలో 31వ వార్షిక వేడుకలు జరిగాయి. ఇది కూడా చూడండి: ముంబైలో వరుస తొక్కిసలాటలు.. ఒకేసారి 22 మంది మృతి! SBI was recognised as the Best Bank in India for the year 2024 by Global Finance Magazine at its 31st Annual Best Bank Awards event, which took place during the sidelines of International Monetary Fund (IMF)/ World Bank (WB) Annual Meetings 2024 at Washington, D.C., United… pic.twitter.com/ZEz94Hn0QN — State Bank of India (@TheOfficialSBI) October 26, 2024 అత్యుత్తమ సేవలు అందించడానికి.. గ్లోబల్ ఫైనాన్స్ అవార్డు వేడుకలో ఎస్బీఐ బ్యాంక్‌ను 2024 ఏడాదికి భారత అత్యుత్తుమ బ్యాంకుగా గుర్తించింది. ఎస్‌బీఐ ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి అత్యుత్తమ భారత బ్యాంక్ అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఖాతాదారులకు అత్యుత్తమ సేవలు అందించడానికి కట్టుబడి ఉన్నామని ఆయన ఈ వేడుక సందర్భంగా తెలిపారు. ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణలో 10 మంది ఎస్పీలు డిస్మిస్...! గ్లోబల్ ఫైనాన్స్ బెస్ట్ బ్యాంక్ అవార్డ్‌లను విశ్వసనీయత, సమగ్రతకు గౌరవంగా ఉన్న బ్యాంకులకు అందజేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి బ్యాంకులను గుర్తిస్తారు. వీటికి ఈ అత్యుత్తమ బ్యాంకు అవార్డులను ప్రదానం చేస్తుంటారు. 22,500 పైగా బ్రాంచ్‌లు, 62వేల ఏటీఎంలతో విస్తృత నెట్‌వర్క్‌ను కలిగిన ఎస్బీఐ యోనో డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా భారతీయ బ్యాంకింగ్ రంగంలో వృద్ధిని బలోపేతం చేస్తోంది. ఇది కూడా చూడండి: Tirumala: తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..ఎప్పుడంటే! ఈ ఆర్థిక సంవత్సరంలో 63శాతం కొత్త సేవింగ్స్ అకౌంట్లు ఖాతాలు డిజిటల్‌గా మారాయి. ఎస్‌బీఐ యోనో ద్వారా మొత్తం రూ.1,399 కోట్లు వ్యక్తిగత రుణాల చెల్లింపులు జరిగినట్లు సమాచారం. అయితే 2013-14, 2022-23 ఆర్థిక సంవత్సరాల మధ్య వార్షిక ఆదాయం రూ. 5 లక్షల వరకు ఉన్న వ్యక్తుల ఆదాయ అసమానత 74.2 శాతం తగ్గినట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఇది కూడా చూడండి: జగన్, షర్మిల ఆస్తుల వివాదం..మధ్యలో పవన్ ఎంట్రీ? వారి ఛాప్టెర్ క్లోజ్! #state-bank-of-india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి