రతన్ టాటా డాక్యుమెంటరీ ఏ ఓటీటీలో చూడవచ్చంటే?

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలు నిన్న అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. ఈ క్రమంలో రతన్ టాటాపై డాక్యుమెంటరీ ఉందనే విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ మొత్తం 5 భాషల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

New Update
FotoJet (26)

ప్రముఖ పారిశ్రామిక వేత్త మరణించారనే విషయం తెలిసిన తర్వాత దేశ వ్యాప్తంగా విషాదంలో మునిగిపోయింది. రతన్ టాటా మరణంపై ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు. అయితే బుధవారం రతన్ టాటా మరణించగా.. నిన్న అధికార లాంఛనాలతో అంత్యక్రియలను పూర్తి చేశారు. రతన్ టాటా బయోపిక్ తీయాలనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ క్రమంలో రతన్ టాటాపై ఓ డాక్యుమెంటరీ ఉందనే విషయం బయటకు వచ్చింది.

ఇది కూడా చూడండి: 'విశ్వంభర' సెట్స్ లో వెంకీ మామ సందడి.. ఫొటోలు వైరల్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో..

నేషనల్ జియోగ్రాఫిక్ ఆఫ్ ఇండియా రతన్ టాటా డాక్యుమెంటరీ ఎపిసోడ్‌ను చేసింది. నేషనల్ జియోగ్రాఫిక్ ఆఫ్ ఇండియా మెగా ఐకాన్స్‌ సీజన్‌ 2లోని ఎపిసోడ్‌2లో రతన్‌ టాటా గెస్ట్‌​గా హాజరై తన జీవితంలో ఉన్న విశేషాలను పంచుకున్నారు. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. 

ఇది కూడా చూడండి: Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు అలర్ట్‌!

ఈ డాక్యుమేంటరీలో తక్కువ ధరకే కారు ఎందుకు తీసుకొచ్చారు? ఆ ఆలోచన ఎలా వచ్చిందనే విషయాల గురించి పూర్తిగా వివరించారు. మొత్తం ఐదు భాషల్లో తెలుగు, హిందీ, తమిళ, బెంగాలీ, ఇంగ్లీష్‌లో చూడవచ్చు. ఈ డాక్యుమెంటరీ ఆసియా టెలివిజన్‌ అవార్డుకు కూడా నామినేట్‌ కావడంతో పాటు ఉత్తమ డాక్యుమెంటరీగా అవార్డు కూడా అందుకుంది.

ఇది కూడా చూడండి: నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Gold Prices Today: భారీగా తగ్గిన బంగారం.. గ్రాము ఎంత ఉందంటే?

నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,340గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140గా ఉంది. ఇక గ్రాము రేటు చూసుకుంటే.. రూ.9,834 గా మార్కెట్‌లో ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

New Update
Gold rate

Gold rate

గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు పైనే దాటింది. లక్ష లేనిదే బంగారం కొనలేరు. అందులోనూ తులం బంగారం అంటే చేతిలో లక్ష కంటే ఎక్కువగానే డబ్బులు పెట్టుకోవాలి. నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,340గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140గా ఉంది. ఇక గ్రాము రేటు చూసుకుంటే.. రూ.9,834 గా మార్కెట్‌లో ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

ఏయే నగరాల్లో ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, ముంబైలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, న్యూఢిల్లీ 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,834, కోల్‌కతా 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, బెంగళూరులో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, కేరళలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, పూణే 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, అహ్మాదాబాద్ 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824గా ఉంది.

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్

 

Advertisment
Advertisment
Advertisment