TATAఆదివాసి హత్యలు, ఎలక్టోరల్ బాండ్లు.. టాటాపై ఉన్నవివాదాల్లో నిజమెంత?

రతన్‌ టాటా కన్నుమూసి రోజులు దాటినా ఇప్పటికీ ప్రజలు ఆయన్ను స్మరిస్తూనే ఉన్నారు. అయితే రతన్‌ టాటా వివాదరహితుడు కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆయనపై ఉన్న వివాదాలేంటో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
tata

Ratan Tata: నాణానికి రెండు వైపులు ఉన్నట్టే ఓ మనిషి కూడా రెండు విధాలుగా ఉండొచ్చు.. ఉండకపోవచ్చునూ..! ఇటివలీ కన్నుమూసిన టాటా గ్రూప్‌ మాజీ చైర్‌పర్శన్‌ రతన్‌ టాటాని విమర్శించేవారూ ఉన్నారు. ముఖ్యంగా పెట్టుబడిదారి విధానాలను వ్యతిరేకించేవారు రతన్‌ టాటా చేసిన తప్పిదాల చిట్టాను సోషల్‌మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇక కొన్ని వార్త కథనాలను చూసినా టాటా విమర్శలకు అతీతుడేమీ కాదన్న విషయం అర్థమవుతుందంటున్నాయి కొన్ని వర్గాలు.

కార్మికలతో వెట్టిచాకిరి

ప్రపంచవ్యాప్తంగా రెండో అతిపెద్ద టీ బ్రాండ్ టెట్లీని కలిగి ఉన్న టాటా గ్లోబల్ బేవరేజెస్ ఈశాన్య భారతంలోని అస్సాం టీ తోటల నుంచి తన బ్లాక్ టీని సేకరిస్తుంది. అయితే  అక్కడ కార్మికలతో టాటా కంపెనీ పనిచేయించుకునే విధానంపై అనేక విమర్శలున్నాయి.  అక్కడి కార్మికుల జీవన పరిస్థితులు దయనీయంగా ఉంటాయి. వారి ఇళ్ల వద్ద పారిశుధ్యం, తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు ఉండవు. మహిళా కార్మికులు తో మరుగుదొడ్డి అందుబాటులో లేవు. ఈ విషయాలన్నిటికి ఫిబ్రవరి 12, 1914న మీడియా సంస్థ DownToEarth నివేదించింది.

హంతకుడిని సమర్థించారా?

భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన యూనియన్ కార్బైడ్ చైర్మన్ వారెన్ ఆండర్సన్‌ను 1984 డిసెంబర్‌లో భారత ప్రభుత్వం అరెస్టు చేసినప్పుడు, ఈ అరెస్టును ఖండించిన అతికొద్ది మంది భారతీయుల్లో రతన్‌ టాటా ఒకరు. భోపాల్ కర్మాగారంలో భద్రతా వ్యవస్థలను తొలగించడం, పరీక్షించని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆమోదించడం ద్వారా ఖర్చులను ఆదా చేయడానికి అండర్సన్ తీసుకున్న నిర్ణయాలు విపత్తుకు ప్రత్యక్ష కారణమయ్యాయి. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో అధికారిక మరణాల సంఖ్య 5,800. అయితే అనాధికారిక లెక్కల ప్రకారం 20,000 నుంచి 25,000 మంది ఈ గ్యాస్‌ లీక్‌ కారణంగా చనిపోయి ఉంటారని అంచనా.

రెండుపార్టీలకూ బాండ్లు సమర్పణ

ఇక 2024 ఎన్నికలకు ముందు ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం రేపింది. ఎలక్టోరల్ బాండ్ల సిస్టమ్‌నే తప్పుబట్టింది. ఇక 2019 మేలో లోక్ సభ ఎన్నికలకు ముందు ఆ ఆర్థిక సంవత్సం(2018-19)లో రూ .800 కోట్లు సమీకరించిందని బీజేపీ భారత ఎన్నికల సంఘానికి ఫైల్స్ సబ్మిట్ చేసింది. విరాళాల మొత్తంలో 55.5 శాతం (రూ.356 కోట్లు) టాటా గ్రూప్‌కు చెందిన ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి వచ్చాయి. అటు అదే ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్‌ పార్టీ రూ.146 కోట్లు సమీకరించింది. ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ కూడా కాంగ్రెస్ పార్టీకి రూ.55 కోట్లు విరాళంగా వచ్చాయి. ఈ విషయాలను ప్రముఖ వార్తా సంస్థ 'బిజినెస్‌ టుడే' నివేదించింది.

ఆదివాసి చావులకు కారణం ఎవరు?

ఒడిశా కళింగ నగర్‌లో ఆదివాసీ నివాసితులకు, టాటా స్టీల్‌ కంపెనీకి మధ్య సుదీర్ఘ పోరాటంలో జరిగింది. నాడు పోలీసు యంత్రాంగమంతా టాటా ఆధీనంలో ఉందన్న విమర్శలున్నాయి. కళింగ నగర్ నిర్వాసితులను 'మావోయిస్టులు'గా చిత్రీకరించడానికి టాటా మీడియాను వాడుకుందన్న ఆరోపణలు నాడు పెద్ద ఎత్తున వచ్చాయి. 2006 జనవరి 2న 14 మంది గిరిజనులు పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. ఈ విషయాలను పలు స్వతంత్ర జర్నలిస్టులు వీడియోల రూపంలో బయటపెట్టారు.

యుద్ధాలకు ఆయుధాలు సప్లై చేశారా?

అటు పలు కంపెనీలు పాలస్తీనా గడ్డపై ఇజ్రాయెల్‌ సృష్టిస్తోన్న మారణహోమానికి కారణం అవుతున్నాయని ఆగస్టు 4,2024న స్వతంత్ర జర్నలిస్టు మెహర్ అలీ రాసుకొచ్చారు. ఇజ్రాయెల్ సైన్యం ఉపయోగించే ఆయుధాల ఉత్పత్తిలో భారతీయ కంపెనీలు ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయి. ఇందులో అదానీ కంపెనీతో పాటు టాటా గ్రూప్‌ కూడా ప్రముఖంగా ఉండడాన్ని అలీ తప్పుబట్టారు.

Also Read :  దేవరగట్టు కర్రల సమరం.. 70 మందికి పైగా గాయాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు