Phone pe: రూ.9 కే బీమా.. దీపావళి వేళ ఫోన్‌పే అదిరిపోయే శుభవార్త! ప్రముఖ ఆన్‌లైన్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే దీపావళి సందర్భంగా బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.9 చెల్లిస్తే టపాసులు కాల్చి గాయపడిన వారికి రూ.25 వేల వరకు బీమా ఇస్తోంది. అయితే ఈ ఆఫర్ అక్టోబర్ 25 నుంచి ప్రారంభమై పది రోజుల పాటు మాత్రమే ఉంటుందని ఫోన్‌పే తెలిపింది. By Kusuma 15 Oct 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి Phonepe: దీపావళి పండుగ రానే వస్తుంది. ఈ పండుగ సందర్భంగా అందరూ ఎక్కువగా టపాసులు కాల్చుతుంటారు. ఇలాంటి సమయంలో గాయపడిన వారిని ఆదుకోవడానికి ప్రముఖ ఆన్‌లైన్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే బంపర్ ఆఫర్‌ను ప్రకటించిది. టపాసులు కాల్చి గాయపడిన వారికి బీమా అందించాలని కొత్తగా బీమా పాలసీని తీసుకొచ్చింది. ఇది కూడా చూడండి: Kidnap: మద్యం దుకాణం లాటరీ వచ్చిందనుకునే లోపే ...కిడ్నాప్ అయ్యాడు! ప్రమాదవశాత్తు గాయపడితే.. ఎవరైనా ప్రమాదవశాత్తు బాణసంచాతో గాయపడిన వారికి అండగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. కేవలం రూ.9 చెల్లిస్తే రూ.25 వేల వరకు బీమా పొందవచ్చని ఫోన్‌పే తెలిపింది. తమ ప్లాట్‌ఫాంలో టాపాసుల సంబంధిత ప్రమాదాల నుంచి సమగ్ర రక్షణ కోసం బీమా పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ బీమా బంపర్ ఆఫర్ కేవలం 10 రోజులు మాత్రమే ఉంటుంది. అక్టోబర్ 25 నుంచి ప్రారంభమై పది రోజుల పాటు ఈ బీమా పాలసీ వర్తిస్తుంది. ఇది కూడా చూడండి: నేడు కొత్త టీచర్లకు పోస్టింగులు ఈ ఆఫర్ కేవలం ఫోన్‌నే యూజర్‌కు మాత్రమే కాకుండా అతని కుటుంబ వ్యక్తులు, భార్య పిల్లలకు కూడా వర్తిస్తుంది. మొత్తం నలుగురు వ్యక్తుల వరకు ఈ కవరేజీని తీసుకోవచ్చు. అక్టోబర్ 25 తర్వాత కొనుగోలు చేసిన వారికి పాలసీ కవరేజీ అందుతుంది. దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకుని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి దీన్ని తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఇది కూడా చూడండి: Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. మరో రెండు రోజులు సెలవులు! ఎలా కొనుగోలు చేయాలంటే? ఈ పాలసీని కొనుగోలు చేయాలంటే ఫోన్‌పే యాప్ ఓపెన్ చేసి బీమా విభాగానికి వెళ్లి ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్ ఎంచుకోవాలి. వివరాలు నమోదు చేసి.. ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పాలసీని కొనుగోలు చేయవచ్చు. ఇది కూడా చూడండి: T20 Womens World cup: పాక్ ఓటమి.. ఇండియా ప్రపంచ కప్ ఆశలు ఆవిరి #phone-pe మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి