Gold Rate: రూ. 79 వేలకు చేరిన బంగారం..కొనగలమా ఇక! పసిడి ధరలు భారీగా పైకి ఎగబాకాయి. శుక్రవారం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.800 పెరిగి.. రూ.72,400గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.870 పెరిగి.. రూ.78,980 కి చేరింది. By Bhavana 18 Oct 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి Gold Rate Today: దీపావళికి ముందు బంగారాన్ని కొనాలనుకునే వారికి పెద్ద షాకే తగిలింది. కొద్ది రోజుల క్రితం బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి..ఇప్పుడు ఆకాశాన్ని తాకుతుంది. వరుసగా మూడో రోజు పసిడి ధరలు భారీగా పైకి ఎగబాకాయి. శుక్రవారం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.800 పెరిగి.. రూ.72,400గా నమోదైంది. Also Read: గ్రూప్-1 పరీక్షలపై బిగ్ ట్విస్ట్! 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.870 పెరిగి.. రూ.78,980 కి చేరింది. అంతర్జాతీయంగా మార్కెట్ ఒడిదుడుకులు, గోల్డ్ రిజర్వ్‌ల నిల్వ లాంటి అంశాలు గోల్డ్ రేట్స్‌పై ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు అంటున్నారు. Also Read: సిన్వర్ చనిపోయే ముందు డ్రోన్ ఫొటేజ్.. వైరల్ అవుతున్న వీడియో దీపావళి, ధన్ తేరస్ ఉన్న నేపథ్యంలో పసిడి పైకి పెరుగుతుందే తప్ప..తగ్గదని నిపుణులు చెబుతున్నారు. బంగారంతో పాటు వెండి కూడా ఆకాశాన్ని తాకుతుంది. మార్కెట్ లో కిలో వెండిపై నేడు రెండు వేలు పెరిగింది. శుక్రవారం కిలో వెండి రూ.99,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్ష ఐదు వేలుగా ఉంది. బెంగళూరులో రూ.94,100గా ఉంది. Also Read: మందుబాబులకు గుడ్ న్యూస్ 22 క్యారెట్ల బంగారం ధరలు: ఢిల్లీ – రూ.72,550, చెన్నై – రూ.72,400, బెంగళూరు – రూ.72,400, ముంబై – రూ.72,400, కోల్‌కతా – రూ.72,400, కేరళ – రూ.72,400 , హైదరాబాద్ – రూ.72,400, విజయవాడ – రూ.72,400, గా కొనసాగుతున్నాయి. Also Read: ప్రపంచానికి మంచి రోజు: జో బైడెన్! 24 క్యారెట్ల బంగారం ధరలు: హైదరాబాద్ – రూ.78,980, విజయవాడ – రూ.78,980, ఢిల్లీ – రూ.79,130, చెన్నై – రూ.78,980, బెంగళూరు – రూ.78,980, ముంబై – రూ.78,980, కోల్‌కతా – రూ.78,980, కేరళ – రూ.78,980 గా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధరలు: హైదరాబాద్ – రూ.1,05,000, విజయవాడ – రూ.1,05,000, ఢిల్లీ – రూ.99,000, ముంబై – రూ.99,000, చెన్నై – రూ.1,05,000, కోల్‌కతా – రూ.99,000,బెంగళూరు – రూ.94,100, కేరళ – రూ.1,05,000 వద్ద స్థిరంగా ఉన్నాయి. #gold-rates-in-hyderabad #gold-rate-today మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి