పడిపోతున్న ఓలా ఎలక్ట్రిక్ షేర్లు.. కారణమిదేనా? ఓలా ఎలక్ట్రిక్ షేర్లు పతనమవుతూ వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై 10వేలకు పైగా ఫిర్యాదులు వచ్చిన కూడా కంపెనీ స్పందించపోవడం, విడి భాగాలు నాణ్యమైనవి లేకపోవడమే దీనికి ముఖ్యకారణమని తెలుస్తోంది. ఇటీవల జాతీయ వినియోగదారుల సేవా కేంద్రం ఓలాకు నోటీసులు జారీ చేసింది. By Kusuma 12 Oct 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఓలా ఎలక్ట్రిక్ వాహనాలకు ఒకప్పుడు మంచి డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు దీని డిమాండ్ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఓలా షేర్లు కూడా కుప్పకూలుతున్నాయి. షేరు ధర ఆగస్టు 20న గరిష్ఠంగా రూ.157.53కు చేరింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు షేరు విలువ తగ్గుతూనే వస్తుంది. అక్టోబర్ 11న ఓలా షేరు విలువ రూ.90.19 వద్ద ముగిసింది. అయితే ఓలా షేర్లు భారీగా తగ్గడానికి ముఖ్య కారణం ఫిర్యాదులకు కంపెనీ స్పందించడం లేదు. ఓలా ఎలక్ట్రిక్ వాహనాలపై ఒక ఏడాదిలో మొత్తం 10 వేలకు పైగా ఫిర్యాదులు అందాయట. ఫిర్యాదులకు స్పందించకపోవడంతో.. జాతీయ వినియోగదారుల సేవా కేంద్రానికి ఫిర్యాదులు అందగా.. వీటిని పరిష్కరించడం కోసం అధికారులను సంప్రదించిన, పరిష్కారానికి ఆసక్తి చూపలేదని తెలిపింది. ఛార్జింగ్, ఉచిత సర్వీస్, సేవల్లో అసంతృప్తి, వారంటీ, వారంటీని తిరస్కరించడం, సర్వీస్ చేసినప్పటికీ మళ్లీ అవే సమస్యలు రావడం వంటి కారణాలు వల్ల ఫిర్యాదు చేశారు. ప్రచారం చేసిన దాంట్లో పోలిస్తే పనితీరులో లోపం ఉందని, అధిక మొత్తంలో రుసుములు చెల్లించుకుంటున్నారని, రశీదుల్లో తేడా కూడా ఉందని అంటున్నారు. ఇది కూడా చూడండి: పేరుకే ఎంబీఏ.. కానీ దొంగతనంలో పీహెచ్‌డీ బ్యాటరీ, విడి భాగాలతో సమస్యలు రావడం, పత్రాలు సరిగ్గా ఇవ్వకపోవడం వంటి సమస్యలు కూడా ఉన్నాయి. వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, సేవల్లో లోపాలు, తప్పుదారి పట్టించే ప్రకటనలు, అన్యాయమైన వాణిజ్య విధానాలు వంటి కారణాల వల్ల సీసీపీఏ అక్టోబరు 7న ఓలాకు షోకాజ్ జారీ చేసింది. దీనిపై స్పందించేందుకు ఓలా ఎలక్ట్రిక్‌కు కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఇచ్చింది. అయితే నోటీసులు జారీ చేసేందుకు ముందు చీఫ్ కమిషనర్ నిధి ఖరే, కమిషనర్ అనుపమ్ మిశ్రాలు వినియోగదారుల ఫిర్యాదులు అన్నింటిని పరిశీలించి ఆ తర్వాతే నోటీసులు జారీ చేశారు. ఇది కూడా చూడండి: హైదరాబాద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు #ola-electric-bike మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి