Stock Market:నష్టాల్లో ముగిసిన సూచీలు..కొనసాగుతున్న డౌన్ ట్రెండ్

ఐటీ షేర్లు, ఆటో షేర్లు కనిష్టానికి పడిపోవడంతో స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. గత కొంతకాలంగా సూచీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 318 పాయింట్లు పడిపోయి. 81,501 వద్ద ముగిసింది, నిఫ్టీ కూడా 86 పాయింట్లు పడిపోయింది. 

New Update
stock

Stock Market Today..

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ఐటీ, ఆటో షేర్లు రాణించకపోవడం...విదేశీ మదుపర్లు ఎక్కువగా విక్రయాలు కొనసాగించడం లాంటి ఈరోజు స్టాక్ మార్కెట్ ను నష్టాల్లోకి నెట్టేశాయి.  ముఖ్యంగా మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్షోసిస్‌లో అమ్మకాల ఒత్తిడి బాగా ఉంది. దీంతో మరోసారి నిఫ్టీ 5 వేల దిగువకు పడిపయింది. 

Also Read: హర్యానా సీఎంగా మరోసారి నాయబ్ సింగ్ సైనీ.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే ?

ఉదయం సెసెక్స్ 81,646.60 పాయింట్ల దగ్గర నష్టాల్లో ప్రారంభమైంది. తరువాత కాసేపు లాభాల్లోకి వచ్చినప్పటికీ.. ఎంతోసేపు నిలవలేదు. ఇంట్రాడేలో 81,358.26 పాయింట్ల దగ్గర కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 318.76 పాయింట్ల నష్టంతో 81,501.36 గ్గర ముగిసింది. నిఫ్టీ కూడా 86.05 పాయింట్ల నష్టంతో 24,971.30 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.00గా ఉంది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 25 క్షీణించగా, 5 షేర్లు మాత్రమే పెరిగాయి. కానీ ఆర్థిక సేవలు, రియల్టీ షేర్లలో పెరుగుదల కనిపించింది. 

Also Read: కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్!

మరోవైపు ఆసియా మార్కెట్‌లో మిశ్రమ ట్రేడింగ్ జరిగింది. హాంగ్‌కాంగ్‌ హ్యాంగ్‌సెంగ్‌ సూచీ 0.16 శాతం నష్టపోయింది. చైనా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 0.05% పెరిగింది. అక్టోబర్ 15న US డౌ జోన్స్ 0.75% క్షీణించి 42,740 దగ్గర.. నాస్‌డాక్ 1.01% పడిపోయి 18,315 దగ్గర ఉన్నాయి. S&P 500 కూడా 0.76 పడిపోయి 5,815కి దిగజారింది. NSE డేటా ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులు అక్టోబర్ 15న ₹1,748 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. నిన్న అన్ని రోజుల కంటే మార్కెట్ ఎక్కువ క్షీణించిందని నిపుణులు చెబుతున్నారు. 

Also Read: ఖగోళ అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు రాదు!

Advertisment
Advertisment
తాజా కథనాలు