ANC Buds: వాటర్ ప్రూఫ్ సపోర్ట్ తో సరికొత్త బడ్జెట్ బడ్స్

ఐటెల్ తాజాగా "Buds Ace" పేరుతో బడ్స్‌ను ₹999 ధరకు లాంచ్ చేసింది, ఇది 25dB నోయిస్ క్యాన్సిలేషన్, 50 గంటల ప్లే టైమ్, IPX5 వాటర్ ప్రూఫ్ సపోర్ట్ కలిగిన సరికొత్త బడ్జెట్ బడ్స్. ఈ బడ్స్ డిసెంబర్ 20 నుండి అమెజాన్‌లో ప్రత్యేక ఆఫర్‌తో అందుబాటులో ఉంటాయి.

New Update
ITEL ANC BUDS

ITEL ANC BUDS

ANC Buds: ఇండియన్ మార్కెట్లోకి ఇప్పుడు సరికొత్త ఇయర్ బడ్స్ లాంచ్ అయ్యాయి. ఇందులో కొత్త ఏముంది అనుకుంటున్నారా? ఈ బడ్స్ కి ఒక స్పెషాలిటీ  ఉంది. అదేంటంటే ఐటెల్ ఇప్పుడు ANC (ఆక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్) బడ్స్ ను కేవలం ₹999 ధరతో అందిస్తోంది. "Buds Ace" పేరిట లాంచ్ చేసిన ఈ బడ్స్ బడ్జెట్ ధరలో ANC సపోర్ట్ ను అందించడం ద్వారా వినియోగదారులకు ఒక కొత్త అనుభవం అందిస్తోంది.

Also Read: విషాదం.. యువ రైతు ప్రాణం తీసిన అప్పులు

ప్రైస్ & ఆఫర్స్..

ఈ బడ్స్ MRP ధర ₹3,999 కాగా, లాంచ్ ఆఫర్ లో ₹999 కు  మాత్రమే లభిస్తుంది. డిసెంబర్ 20వ తేదీ నుంచి ఈ బడ్స్ అమెజాన్ లో ప్రత్యేకంగా అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. మరొక ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకారం, మొదట 100 మంది కొనుగోలుదారులకు ఈ బడ్స్ ₹299 కు లభించనున్నాయి.

Also Read: అల్లు అర్జున్‌కు పవన్ కళ్యాణ్ దిమ్మతిరిగే షాక్!

ఫీచర్స్..

ఈ బడ్స్ లో 25dB ఆక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్, ఎజీ టచ్ కంట్రోల్స్, స్టైలిష్ డిజైన్ ఉండేలా ఐటెల్ తయారు చేసింది. ఈ బడ్స్ యూజర్లకు 50 గంటల ప్లే టైం ఇస్తాయి, ఇంకా మంచి కాలింగ్ అనుభవం కోసం డ్యూయల్ మైక్రోఫోన్ ENC సపోర్ట్ కూడా అందిస్తుంది.

Also Read: కల్తీ లడ్డూ వివాదం.. తిరుమలలో సిట్ అధికారులు!

ఈ బడ్స్ లో క్విక్ ఛార్జ్ సపోర్ట్, IPX5 రేటింగ్ తో వాటర్ ప్రూఫ్ గా అందించింది. ఈ బడ్స్ క్రేన్ బెర్రీ, వైట్, మిడ్ నైట్ బ్లూ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు