/rtv/media/media_files/2026/03/10/indigo-2026-03-10-18-58-39.jpg)
ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీటర్ ఎల్బర్స్ తన పదవికి రాజీనామా చేశారు. గత కొన్ని నెలలుగా ఇండిగో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఈ నిర్ణయానికి దారితీసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల తాను వైదొలుగుతున్నానని, తన నోటీసు పీరియడ్‌ను కూడా రద్దు చేయాలని ఎల్బర్స్ బోర్డుకు రాసిన లేఖలో కోరారు. మార్చి 10 నుంచే ఈ రాజీనామా తక్షణమే అమలులోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది.
With immediate effect, Pieter Elbers will be stepping down as InterGlobe Aviation Limited's (IndiGo) CEO. Rahul Bhatia, Managing Director of IndiGo, shall in the interim assume management of the affairs of the airline until such time that the Company announces the arrival of a… pic.twitter.com/hQBODsT1dn
— ANI (@ANI) March 10, 2026
డైరెక్టర్ రాహుల్ భాటియా
కొత్త సీఈఓను నియమించే వరకు ఇండిగో మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా విమానయాన సంస్థ కార్యకలాపాల బాధ్యతలను స్వీకరించనున్నారు. కంపెనీ సంస్కృతిని బలోపేతం చేయడం, విమానాల సర్వీసుల్లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పడం, వినియోగదారులకు నమ్మకమైన సేవలను అందించడమే లక్ష్యంగా రాహుల్ భాటియా పనిచేస్తారని ఇండిగో బోర్డు ఛైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా తెలిపారు.
గత 22 ఏళ్లుగా ఇండిగోను ఒక స్థాయికి తీసుకొచ్చిన రాహుల్ భాటియా మాట్లాడుతూ.. విమానయాన సంస్థ పట్ల, దేశం పట్ల తనకు ఎంతో బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఇండిగోను వృత్తిపరంగా, నమ్మకమైన, అంతర్జాతీయ స్థాయిలో గౌరవప్రదమైన ఎయిర్‌లైన్‌గా కొనసాగించేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎల్బర్స్ నిష్క్రమణ తర్వాత కొత్త నాయకత్వం కోసం ఇండిగో వేట మొదలుపెట్టింది, త్వరలోనే కొత్త బాస్ ఎవరనేది వెల్లడయ్యే అవకాశం ఉంది.
Follow Us