ఆఫర్ అదిరిపోయింది మచ్చా.. గూగుల్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్..!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో గూగుల్ పిక్సెల్ 7ఏ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.43,999 కాగా.. సేల్ లో కేవలం రూ.31,999కే సొంతం చేసుకోవచ్చు. HDFC కార్డుపై కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.1250 డిస్కౌంట్ అందుకోవచ్చు.

New Update
Google Pixel 7a

Google Pixel 7a: ఎంతగానో ఎదురుచూసిన ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2024 సేల్ గత నెల అంటే సెప్టెంబర్ 27 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్ ముందుగా సెప్టెంబర్ 26 నుంచి ప్రైమ్ సభ్యుల ముందుకు వచ్చింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లతో సహా మరెన్నో ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లపై కళ్ళు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లు పొందొచ్చు. అందువల్ల ఎప్పటినుంచో ఒక బ్రాండెడ్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని అనుకుంటున్నట్లయితే ఈ సేల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. 

ఇది కూడా చదవండి: ఆండ్రాయిడ్ యూజర్లకు షాక్.. కొత్త వైరస్‌తో మీ ఖాతాలు ఖతం

ఇందులో భాగంగానే కస్టమర్లు గూగుల్ ఫోన్‌ను ఉహకందని డిస్కౌంట్ ఆఫర్‌తో కొనుక్కోవచ్చు. గూగల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a) ని ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భారీ తగ్గింపుతో కొనుక్కోవచ్చు. ఇది 6.1 అంగుళాల FullHD + OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ Google Pixel 7a ఫోన్‌ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్‌కి సంబంధించిన ఆఫర్లు, స్పెసిఫికేషన్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

Google Pixel 7a

స్మార్ట్‌ఫోన్ మోడల్‌లోని 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ గల వేరియంట్ అసలు ధర రూ.43,999 ఉండగా ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ.31,999కి కొనుక్కోవచ్చు. అంతేకాకుండా భారీ బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. HDFC బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ట్రాన్సక్షన్లపై 10% (రూ. 1250 వరకు) తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ ధర మరింత తగ్గుతుంది. కేవలం రూ. 30,749కే కొనుక్కోవచ్చు. దీని బట్టి చూస్తే Google Pixel 7a స్మార్ట్‌ఫోన్‌పై దాదాపు రూ.13,250 డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. ఒకరకంగా ఇది చాలా పెద్ద డిస్కౌంట్ అనే చెప్పాలి. 

Google Pixel 7a స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది 6.1 అంగుళాల పూర్తి HD + OLED డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఫోన్ సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించబడింది. Pixel 7a స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే.. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్, Qi ఛార్జింగ్ స్టాండర్డ్‌కు మద్దతుతో 4385mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్ వెనుక భాగంలో 64ఎంపీ కెమెరా అందించారు. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే 13ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా అందించారు. ఇక ఫోన్ ముందు భాగంలో సేల్ఫీలు, వీడియో కాలింగ్‌ల కోసం 13మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. మొత్తంగా ఈ ఫోన్ అధునాతన ఫీచర్లతో అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు