GNSS System : నేషనల్ హైవేలపై 20 కిలోమీటర్లకు టోల్ చెల్లించక్కర్లేదు

గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) ఆధారిత టోల్ వసూలు వ్యవస్థ అమలు చేయడానికి రంగం సిద్ధం అయింది. దీని కోసం  రోడ్లు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను జారీ చేసింది. ఇప్పుడు నేషనల్ హైవేలపై 20 కిలోమీటర్ల ప్రయాణానికి టోల్ వసూలు చేయరు. 

author-image
By KVD Varma
New Update
GNSS System Toll gate

GNSS System: టోల్ వసూళ్ల కోసం ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఇందుకోసం ఇప్పుడు కొత్త నిబంధనలు జరీ చేసింది. దీని ప్రకారం జాతీయ రహదారిపై రోజూ 20 కిలోమీటర్ల దూరం వరకు జీఎన్‌ఎస్‌ఎస్‌తో కూడిన ప్రైవేట్ వాహనాల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయరు. 20 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించిన వారి నుంచి  టోల్ వసూలు చేస్తారు. అయితే జీఎన్‌ఎస్‌ఎస్‌తో అనుసంధానమైన వాహనాలు మాత్రమే ఈ ప్రయోజనం పొందుతాయి. వారి సంఖ్య ఇంకా తక్కువగా ఉంది, కాబట్టి ఈ సిస్టమ్ ప్రస్తుతానికి హైబ్రిడ్ మోడ్‌లో పని చేస్తుంది. అంటే క్యాష్ అలాగే ఫాస్టాగ్ రెండు విధానాల్లో అందుబాటులో ఉంటుంది. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు ద్వారా టోల్ వసూలు కొనసాగుతుంది.

మైసూర్ - పానిపట్ హైవేలపై ట్రయల్ రన్:

GNSS ద్వారా టోల్ వసూలు కోసం ట్రయల్ రన్ బెంగళూరు-మైసూర్ హైవే (NH-275),  పానిపట్-హిసార్ (NH-709)లో నిర్వహించారు. ఇది కాకుండా, ప్రస్తుతం దేశంలో ఎక్కడా GNSS కోసం ప్రత్యేక లేన్ లేదు. వాహనాలను GNSS ఎనేబుల్ చేయడానికి, ఆన్-బోర్డ్ యూనిట్ (OBU) లేదా ట్రాకింగ్ పరికరాన్ని ఇన్‌స్టాల్ చేయాలి.

తెలుసుకోవాల్సిన విషయాలు.. 

  • హైవే నిపుణుల అభిప్రాయం ప్రకారం, GNSS అమలు తర్వాత, వాహనం హైవేకి చేరుకోగానే, దాని ప్రవేశ స్థానం టోల్ గేట్ అవుతుంది. హైవేని తాకగానే మీటర్ స్టార్ట్ అవుతుంది. స్థానిక ప్రజలు టోల్ గేట్ నుండి 20 కి.మీ. వరకూ ఎటువంటి ఛార్జీ లేకుండా హైవే పై ప్రయాణించవచ్చు.  21వ కిలోమీటరు నుంచి టోల్ లెక్కింపు ప్రారంభమవుతుంది.

  • ప్రతి టోల్ వద్ద కొన్ని లేన్‌లు GNSSకి ప్రత్యేకంగా కేటాయిస్తారు. తద్వారా GNSS అనుసంధానం ఉన్న వాహనాలు మాత్రమే ఆ లేన్‌లో వెళ్లగలవు.

  • కొత్త సిస్టమ్ ప్రకారం అన్ని వాహనాలకు GNSS ఆన్‌బోర్డ్ యూనిట్ ఉండాలి. అత్యవసర సహాయం కోసం పానిక్ బటన్ ఉన్న కొత్త వాహనాల్లో మాత్రమే ఇది ప్రస్తుతం అందుబాటులో ఉంది. మిగతా అన్ని వాహనాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

  • ఫాస్టాగ్ లాగానే ఆన్-బోర్డ్ యూనిట్ (OBU) కూడా ప్రభుత్వ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంటుంది. వాటిని వాహనాలపై అమర్చనున్నారు. దీనికి లింక్ చేసిన బ్యాంక్ ఎకౌంట్  నుండి టోల్ మొత్తం కట్ అవుతుంది. 

  • కారు/ట్రక్కులో OBUని ఇన్‌స్టాల్ చేయడానికి అయ్యే ఖర్చు దాదాపు రూ. 4,000. వాహన యజమాని భరించవలసి ఉంటుంది.

  • అన్ని వాహనాలు GNSS యూనిట్లతో అమర్చబడి.. అన్ని లేన్లు GNSS కోసం ప్రారంభించాకా,  అన్ని టోల్ బూత్‌లు రోడ్ల నుండి పూర్తిగా తొలగిస్తారు. 

  • NHAIకి ఏటా దాదాపు రూ.40,000 కోట్ల టోల్ ఆదాయం వస్తుంది. కొత్త విధానం పూర్తిగా అమలులోకి వచ్చిన తర్వాత ఇది రూ.1.4 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా.

  • జిఎన్‌ఎస్‌ఎస్‌ను అమలు చేయడానికి బిడ్స్ ఆహ్వానించారు. ఈ దరఖాస్తుల ఆధారంగానే ఇప్పుడు వారికి టెండర్ల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. 

GNSS అంటే ఏమిటి?

GNSS System: దేశంలోని అన్ని జాతీయ రహదారులపై జిఐఎస్ (జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) మ్యాపింగ్ జరిగింది. ఇది ఫాస్టాగ్ కాకుండా, GNSS ఉపగ్రహ ఆధారిత సాంకేతికతపై పనిచేస్తుంది. ఇది ఖచ్చితమైన ట్రాకింగ్‌కు దారి తీస్తుంది. ఇది టోల్‌ను లెక్కించడానికి GPS, భారతదేశం GPS ఎయిడెడ్ GEO ఆగ్మెంటెడ్ నావిగేషన్ (GAGAN) సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది.

Also Read :  మరికాస్త తగ్గిన బంగారం ధర.. వెండి ధర పరుగు!

Advertisment
Advertisment
తాజా కథనాలు