Gas Cylinder Prices: పండగ వేళ పెరిగిన గ్యాస్‌ ధరలు..!

నవరాత్రులకు ముందు కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఓ చేదు వార్తను చెప్పాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటును రూ.50 మేర పెంచుతున్నట్టు కంపెనీలు ప్రకటించాయి.

New Update
cylender

Gas Cylinder Prices : నవరాత్రులకు ముందు కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఓ చేదు వార్త. వరుసగా మూడో నెల అక్టోబర్‌లో కూడా గ్యాస్ ధర పెరిగింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటును రూ.50 మేర పెంచుతున్నట్టు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని కంపెనీలు ప్రకటించాయి. 

నవరాత్రి, దసరా, దీపావళి వంటి పండుగల వేళ కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఎదురుదెబ్బ అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. 
 తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ ధర రూ.1691 నుంచి రూ.1740కి చేరుకుంది. కోల్‌కతాలో రూ.1802 నుంచి రూ.1850.50కి, ముంబైలో రూ.1644 నుంచి రూ.1692.50కి, చెన్నైలో రూ.1855 నుంచి రూ.1903కి  పెరిగినట్లు మార్కెటింగ్‌ కంపెనీలు ప్రకటించాయి.

 కాగా అంతకుముందు సెప్టెంబర్ 1, ఆగస్టు 1న కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు పెంచిన సంగతి తెలిసిందే. కాగా 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని, పాత ధరలే యథాతథంగా కొనసాగుతాయని చమురు కంపెనీలు తెలిపాయి. ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. అందులో భాగంగా ఇవాళ కూడా సవరించిన ధరలను ప్రకటించాయి.

Also Read: దసరాకి ఏపీఎస్‌ ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు