AC prices : ఏసీ కొనాలనుకుంటున్నారా? జేబుకు చిల్లు పడకముందే ప్లాన్ చేసుకోండి.

వేసవి కాలం మొదలవ్వకముందే ఏసీ కొనాలనుకునే వారికి బిగ్ షాక్ ఈ ఏడాది ఏసీల ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రముఖ కంపెనీలన్నీ తమ ఏసీల ధరలను 5% నుండి 15% వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి.

New Update
ac

వేసవి కాలం మొదలవ్వకముందే ఏసీ కొనాలనుకునే వారికి బిగ్ షాక్ ఈ ఏడాది ఏసీల ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రముఖ కంపెనీలన్నీ తమ ఏసీల ధరలను 5% నుండి 15% వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ముడి సరుకుల ధరలు పెరగడం, రూపాయి విలువ తగ్గడం, కొత్త విద్యుత్ పొదుపు నిబంధనలే దీనికి ప్రధాన కారణాలు.

వోల్టాస్, డాయికిన్, ఎల్‌జీ, బ్లూ స్టార్, హెయర్ వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే ధరల పెంపును ఖరారు చేశాయి. ఏప్రిల్ నుండి ఈ కొత్త ధరలు పూర్తిస్థాయిలో అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా ఏసీల్లో వాడే కాపర్ (రాగి) ధరలు పెరగడం, విదేశాల నుండి విడిభాగాలను దిగుమతి చేసుకునేటప్పుడు డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం వల్ల తయారీ ఖర్చు పెరిగిందని కంపెనీలు చెబుతున్నాయి.

దీనికి తోడు, ఈ ఏడాది జనవరి 1 నుండి 'బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ' (BEE) కొత్త స్టార్ రేటింగ్ నిబంధనలను తీసుకువచ్చింది. దీనివల్ల ఏసీలు మరింత నాణ్యంగా, కరెంట్ తక్కువ ఖర్చయ్యేలా తయారవుతున్నాయి. ఉదాహరణకు, కొత్త 5-స్టార్ ఏసీలు పాత వాటికంటే 10% ఎక్కువ విద్యుత్తును ఆదా చేస్తాయి. అయితే ఈ టెక్నాలజీ వల్ల తయారీ ఖర్చు పెరగడంతో, ఆ భారాన్ని వినియోగదారులపై వేయక తప్పడం లేదని యాజమాన్యాలు అంటున్నాయి.

ఏసీల అమ్మకాలు రికార్డు స్థాయిలో

ధరలు పెరిగినప్పటికీ, ఈ ఏడాది ఏసీల అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయని కంపెనీలు ఆశిస్తున్నాయి. 2024లో ఎండలు తీవ్రంగా ఉండటంతో అమ్మకాలు చాలా బాగున్నాయి, కానీ 2025లో అకాల వర్షాల వల్ల మార్కెట్ కాస్త డల్ అయ్యింది. ఇప్పుడు 2026లో ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, కనీసం 15% వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న పాత స్టాక్ అయిపోగానే, కొత్త రేట్లతో కూడిన ఏసీలు షాపుల్లోకి రానున్నాయి.

Advertisment
తాజా కథనాలు