RBI: జనం వద్ద రూ. 2వేల నోట్లు ఇంకా ఎన్నున్నాయో తెలుసా!.. ఆర్బీఐ లెక్క చెప్పింది రెండు వేల రూపాయల నోట్లు ఉపసంహరించుకుని ఆరు నెలలు గడుస్తున్నా జనం వద్ద ఇంకా రూ. 9,760 కోట్ల విలువైన నోట్లు ఉన్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ప్రస్తుతం ఆ నోట్లను ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల వద్ద మార్చుకోవచ్చని తెలిపింది. By Naren Kumar 01 Dec 2023 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి RBI: రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించి ఆరు నెలలు గడుస్తున్నా ఇంకా రూ. 9,760 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే ఉన్నాయట. రిజర్వ్ బ్యాంకే ఈ విషయాన్ని వెల్లడించింది. ఇప్పటివరకూ చలామణీలో ఉన్న రూ.2 వేల నోట్లలో 97.26 శాతం తిరిగి బ్యాంకుల్లోకి వచ్చి చేరాయి. ఈ ఏడాది మే 19న ఆర్బీఐ రూ. 2వేల నోట్లను ఉపసంహరించే నాటికి ప్రజల వద్ద రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉన్నాయి. బ్యాంకుల్లో నోట్ల మార్పిడి, డిపాజిట్ కోసం ఆర్బీఐ మొదట సెప్టెంబర్ 30 వరకు గడువిచ్చింది. అనంతరం దానిని మరో వారం రోజులు అంటే అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఇది కూడా చదవండి: బ్యాంకులకు ఆర్బీఐ ఫైన్: నిబంధనల ఉల్లంఘనపై సీరియస్ అయితే, రూ.2 వేల నోటు ఇప్పటికీ న్యాయసమ్మతమైన ద్రవ్యంగా కొనసాగుతుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనే రూ. 2వేల నోట్లను తీసుకుంటున్నారు. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, బేల్‌పుర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగడ్, చెన్నై, గువాహటి, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, నాగ్‌పూర్, దిల్లీ, పట్నా, తిరువనంతపురంలో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. ఆయా కార్యాలయాల వద్ద నోట్ల మార్పిడి, డిపాజిట్ సదుపాయాలను పొందవచ్చని ఆర్బీఐ తెలిపింది. అక్కడికి వెళ్లలేనివారు తమ వద్ద ఉన్న నోట్లను పోస్టల్ శాఖ ద్వారా అక్కడికి పంపించవచ్చని కూడా ఆర్బీఐ వెల్లడించింది. #rbi #rs-2000-notes మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి