Burger in Guinness: అయ్యబాబోయ్.. గిన్నిస్ బుక్ ఎక్కిన బర్గర్.. తినాలంటే లక్షలు కావాల్సిందే! ఒక బర్గర్ ఖరీదు ఎంత ఉంటుంది? ఎంత పెద్ద షాపులో తిన్నాసరే మహా అయితే ఓ వెయ్యిరూపాయలు. కానీ, గెల్డర్‌ల్యాండ్‌లోని వూర్తుయిజెన్‌లోని డాల్టన్స్ రెస్టారెంట్ మెనూలోని బర్గర్ దాదాపు ఐదు లక్షల రూపాయలు. దీంతో ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరిపోయింది. By KVD Varma 20 Jun 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Burger in Guinness: లక్షల విలువ చేసే ఓ బర్గర్ సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తోంది. ఈ బర్గర్ ధర 5 లక్షల రూపాయలు. ఇప్పుడు అది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పేజీలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్‌గా స్థానం సంపాదించుకుంది . ఈ వీడియో స్వతహా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. నెటిజన్లు దీని ధరను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ ప్రత్యేకమైన బర్గర్‌ను డచ్ చెఫ్ రాబర్ట్ జాన్ డి వీన్ తయారు చేశారు మరియు ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్‌గా గెల్డర్‌ల్యాండ్‌లోని వూర్తుయిజెన్‌లోని డాల్టన్స్ రెస్టారెంట్ మెనూలో ఉంది. టాపింగ్ పూర్తిగా బంగారు పూతతో ఉంది. ఈ బర్గర్‌కు 'ది గోల్డెన్ బాయ్' అని పేరు పెట్టారు. దీని ధర $5,967 అంటే భారత కరెన్సీలో రూ.4,97,813. ఈ వీడియో జూన్ 19న @guinnessworldrecords Instagram ఖాతాలో షేర్ చేశారు. షేర్ చేసిన ఒక్కరోజులోనే ఈ వీడియోకు మూడు లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. అంతేకాకుండా 11 వేల మందికి పైగా వీడియో లైక్స్ ద్వారా తమ అభినందనలు తెలియజేసారు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) #guinness-world-records #burger మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి