KCR: బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం..కరీంనగర్ లో 12న భారీ బహిరంగ సభ..!

బీఆర్ఎస్ లోకసభ ఎన్నికలకు శంఖారావాన్ని పూరించింది. ఎన్నికల నేపథ్యంలో ఈనెల 12 కరీంనగర్ లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగసభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.

New Update
KCR: బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం..కరీంనగర్ లో 12న భారీ బహిరంగ సభ..!

KCR:  భారత రాష్ట్ర సమితి( బీఆర్ఎస్) లోకసభ ఎన్నికలకు కరీంనగర్ జిల్లా నుంచి శంఖారావం పూరించింది. ఈనెల 12వ తేదీ కరీంనగర్ లో భారీ బహిరంగసభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ డిగ్రీ కాలేజీ మైదానంలో ఈ బహిరంగ సభను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ భవన్ లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్.

ఎన్నికల్లో భాగంగా రోడ్ షోలు నిర్వహించాలని గులాబీ బాస్ డిసైడ్ అయ్యారు. దీనిలో ఆయన స్వయంగా పాల్గొనున్నట్లు తెలిపారు. లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ , బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్నారు. ఈనెల 12న కరీంనగర్ లో బహిరంగసభ నిర్వహించనున్నట్లు గులాబీ బాస్ తెలిపారు. మండలస్థాయిలోనూ పార్టీ సమావేశాలు నిర్వహించాలని నేతలకు సూచించారు. బస్సు యాత్రలు చేద్దామని నేతలుకు పిలుపునిచ్చారు కేసీఆర్. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలో భేటీ తర్వాత పెద్దపల్లి నియోజకవర్గ నేతలతో సమావేశం అయ్యారు కేసీఆర్.

ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కాగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ గా పోటీ చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని మాజీ సీఎం కేసీఆర్ బావిస్తున్నట్లుయ్ తెలుస్తోంది. ఇందుకు కారణం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెంది సీఎం కుర్చీ పోవడమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి కేసీఆర్ కామారెడ్డిలో ఓటమి చెంది.. గజ్వేల్ లో విజయం సాధించారు. తెలంగాణలో తమ ప్రభుత్వం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఆయన తీవ్ర నిరాశలో ఉన్నారని.. అందుకే అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేదని ఒక వర్గం ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం తుంటి ఎముకకు సర్జరీ కావడంతో కేసీఆర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని అందుకే ఇన్ని రోజులు ప్రజలకు దూరంగా ఉన్నారని అంటున్నారు. కేసీఆర్ ఎంపీగా పోటీ చేసి అసెంబ్లీకి బై చెప్పి పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపిస్తారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. మరి కేసీఆర్ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజుల వరకు వేచి చూడాల్సి ఉంది.

ఇది కూడా చదవండి:  ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన..10 రోజుల..12 రాష్ట్రాల టూర్.!

Advertisment
Advertisment
తాజా కథనాలు