BIG BREAKING: కవితకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు!

లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలులో ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనారోగ్యం బారిన పడ్డారు. మంగళవారం ఉన్నట్టుండి ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే స్పందించిన జైలు సిబ్బంది కవితను దీన్ దయాల్‌ హాస్పిటల్‌కు తరలించగా డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.

New Update
BIG BREAKING: కవితకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు!

KAVITHA: లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలులో ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనారోగ్యం బారిన పడ్డారు. మంగళవారం ఉన్నట్టుండి ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే స్పందించిన జైలు సిబ్బంది కవితను దీన్ దయాల్‌ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 2024 మార్చి 15 ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. నాలుగు నెలలుగా ఆమె జైలులో ఉన్నారు. ఈ స్కామ్ కు సంబంధించి మొదట కవితపై ఈడీ కేసు నమోదు చేయగా.. తర్వాత సీబీఐ సైతం ఎంటరైంది. ఈ కేసుల్లో బెయిల్ కోసం కవిత విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

సీబీఐ కేసులో కవితపై చేపట్టిన విచారణను రౌస్ అవెన్యూ కోర్టు ఇటీవల వాయిదా వేసింది. కేసులో కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణ జూలై 22కు వాయిదా వేసింది. మద్యం కేసులో కవిత పాత్ర, ఈ నేపథ్యంలోనే సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను దాఖలు చేసినట్టు సీబీఐ కోర్టుకు తెలిపింది. దానిని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయ స్థానాన్ని కోరింది. ఈ అంశంపై విచారణ చేపడతామని న్యాయమూర్తి భవేజా తెలిపారు. ఈ సందర్భంగా సీబీఐ ఛార్జిషీట్‌లో తప్పులున్నాయని కవిత తరపు లాయర్ నితేష్ రానా కోర్టుకి తెలిపారు. ఛార్జిషీట్‌లో తప్పులు లేవని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. జూలై 22కి తదుపరి విచారణను రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు