MLC Kavitha: ఈడీ ఆఫీస్ లో కవిత ఉపవాసం.. ఏ పుస్తకాలు చదువుతున్నారంటే?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఏడు రోజుల పాటూ కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. కస్టడీలో ఉన్న కవిత ఏం చేస్తున్నారో, ఎలా ఉంటున్నారో బయటకు వచ్చింది.

New Update
MLC Kavitha: ఈడీ ఆఫీస్ లో కవిత ఉపవాసం.. ఏ పుస్తకాలు చదువుతున్నారంటే?

MLC Kavitha Reading Books In Custody: లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam Case) అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ (ED) కస్టడీలో ఉన్నారు. మార్చి 23 వరకు ఈమె రిమాండ్ కొనసాగనుంది. కస్టడీలో రోజు ఈడీ అధికారులు కాసేపు కవితను విచారిస్తున్నారు. ఆతరువాత మాత్రం ఆమె పుస్తకాలు చదువుకుంటూ కాలం గడుపుతున్నారు. నిన్న బుధవారం ఏకాదశి సందర్భంగా ఉపవాసం కూడా ఉన్నారని చెబుతున్నారు. అందుకే ఈడీ అధికారులు కవితకు పళ్ళు తీసుకొచ్చి ఇచ్చారని సమాచారం.

పుస్తకాల్లో మునిగిపోయారు..
ఇక కస్టడీలో ఉన్న కవిత ఎక్కువ టైమ్ పుస్తకాలు చదవడానికే పెడుతున్నారు. అంబేద్కర్ జీవిత గాథ, ఏ ఎస్ పన్నీర్ సెల్వం రాసిన కరుణానిధి-ఏ లైఫ్, శోబన కే నాయర్ రాసిన రాం విలాస్ పాశ్వాన్-ది వెదర్వాన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ పుస్తకాలను అడిగి తెప్పించుకున్నారు. వీటితో పాటూ స్వామి సర్వప్రియానంద రాసిన భగవద్గీత పుస్తకాన్ని (Bhagavad Gita) కూడా తెప్పించుకున్నారు. రోజు మొత్తంలో భగవద్గీత పుస్తకాన్ని ఎంతో కొంతసేపు కచ్చితంగా చదువుతున్నారని ఈడీ అధికారులు చెబుతున్నారు. అలాగే పుస్తకాల్లో చదివిన అంవాలను ఆమె తన డైరీలో కూడా నోట్ చేసుకుంటున్నారుట.

కవిత సిబ్బందిని ప్రశ్నించిన ఈడీ..

మరోవైపు ఈరోజు ఈడీ అధికారులు కవిత పీఆర్వోలను విచారించారు. అంతకు ముందే ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియా మీనా 16 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో 11 ఫోన్లను తిరిగిచ్చేయగా...5 ఫోన్లను మాత్రం తమతోనే ఉంచుకున్నారు. ఇందులో కవిత, ఆమె భర్త అనిల్, పీఆర్వో రాజేశ్, సీఏ శరత్ కుమార్, సిబ్బంది రోమిత్ రావుల ఫోన్లు ఉన్నాయి. ఇవాళ పీఆర్వో రాజేశ్, రోహిత్ రావులను ఈడీ పిలిపించి, మాట్లాడింది. ఉదయం 10 గంటలకు వీరిని ఈడీ పలు ప్రశ్నలు అడిగారని తెలుస్తోంది. ఇందులో కవిత పీఆర్వోగా రాజేశ్ చాలా కాలంగా పని చేస్తున్నారు. రోహిత్రావు మాత్రం జాయిన్ అయి మూడు నెలలు అయిందని తెలుస్తోంది. ఇక కవిత సోదరుడు కేటీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. రోజూ ఆమెను కలుస్తున్నారు. మొదటి రోజు కవిత భర్త అనిల్, హరీశ్ రావులతో కలిసి వెళ్ళిన కేటీఆర్..తరువాత నుంచి అడ్వొకేట్ మోహిత్ రావుతో మాత్రమే వెళుతున్నారని తెలుస్తోంది.

Also Read:National: ఫ్లైట్ టికెట్ కొనలేం.. ట్రైన్ లో కూడా వెళ్లలేం: మోదీపై రాహుల్ ధ్వజం

Advertisment
Advertisment
తాజా కథనాలు