MLC Baswaraju Saraiah: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్సీ

TG: బీఆర్ఎస్ పార్టీని నేతల రాజీనామాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కూడా బీఆర్ఎస్‌కు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాం నామినేషన్ ర్యాలీలో పాల్గొనడంతో త్వరలో ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్తారనే చర్చ జోరందుకుంది.

New Update
MLC Baswaraju Saraiah: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్సీ

MLC Baswaraju Saraiah To Join Congress: బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. వరంగల్‌లో బీఆర్‌ఎస్‌కు ఒకేరోజు దెబ్బ మీద దెబ్బ పడింది. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వెళ్లనున్నారు. ఖమ్మం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రఘురాం నామినేషన్‌ కార్యక్రమంలో సారయ్య పాల్గొన్నారు. బస్వరాజు సారయ్యకు సురేందర్‌రెడ్డి రాజకీయ గురువు కావడంతో.. తన గురువు కుమారుడి నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సారయ్య చెబుతున్నారు. కాగా ఇవాళ కాంగ్రెస్‌లోకి వరంగల్‌ మేయర్‌ సుధారాణి చేరిన విషయం తెలిసిందే. వరుసగా బీఆర్‌ఎస్‌ను నాయకులు వీడుతున్నారు. ఇదిలా ఉంటే సారయ్య మొదటగా కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌ లో చేరారు.. తాజాగా తిరిగి తన సొంత గూటిలోకి వెళ్లనున్నారు.

Also Read: కాంగ్రెస్ అధిష్టానంపై అలిగిన భట్టి, తుమ్మల

Advertisment
Advertisment
తాజా కథనాలు