Telangana Assembly Sessions: సీఎం రేవంత్‌, మంత్రులను.. హరీష్‌రావు ఒంటిచేత్తో ఎదుర్కొన్నారు : కేటీఆర్‌

ఈరోజు జరిగిన అసెంబ్లీలో మంత్రి హరీష్‌రావు.. సీఎం రేవంత్‌ రెడ్డి, క్యాబినేట్‌ మంత్రులందరినీ ఒంటిచెత్తో ఎదుర్కొని సత్తా చూపించారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ ఎక్స్‌లో తెలిపారు. రేపు జరగబోయే ఛలో నల్గొండ సభకు ఓ ఫర్‌ఫెక్ట్‌ టోన్‌ను చూపించారు.

New Update
Telangana Assembly Sessions: సీఎం రేవంత్‌, మంత్రులను.. హరీష్‌రావు ఒంటిచేత్తో ఎదుర్కొన్నారు : కేటీఆర్‌

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సభలో అధికార, విపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. అయితే ఈ సభకు సంబంధించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ ఎక్స్‌లో స్పందించారు. ' ఈరోజు జరిగిన జరిగిన శాసనసభలో హరీశ్‌రావు అద్భత ప్రసంగం చేశారు. అవగాహన లేని ముఖ్యమంత్రి, ఆయన మొత్తం క్యాబినేట్‌పై సింగిల్‌ హ్యాండ్‌తోనే సత్తా చూపించారు. కృష్ణా నీళ్లు/ కేఆర్ఎంబీకి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ నేతలు చేసిన ఫేక్‌ ప్రచారాలు, అబద్ధాలను హరీష్‌ రావు తిప్పికొట్టారు. రేపు జరగబోయే ఛలో నల్గొండ సభకు ఓ ఫర్‌ఫెక్ట్‌ టోన్‌ను చూపించారు. ఈ సభలో కేసీఆర్‌ తనదైన శైలిలో.. కాంగ్రెస్‌ చేస్తున్న తప్పుడు ప్రచారాలు, అబద్దాలను ఎండగడతారని' కేటీఆర్‌ పేర్కొన్నారు.

Also Read: ‘హరీష్.. మా పార్టీలోకి రా.. ఆ శాఖ అప్పగిస్తాం’: కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి

ఇదిలాఉండగా.. రేపు నల్గొండలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ సభకు పెద్ద ఎత్తున హాజరుకావాలని కేసీఆర్‌, కేటీఆర్‌లు పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే కేసీఆర్ నల్గొండకు వచ్చే వచ్చే తమ జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పి రావాలంటూ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు.

Also read: గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే నోటిఫికేషన్..

Advertisment
Advertisment
తాజా కథనాలు